రవితేజ సరసన క్రాక్ తో బిగ్గెస్ట్ రీ ఎంట్రీ హిట్ కొట్టి.. పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న శృతి హాసన్ లేటెస్ట్ వెబ్ సీరీస్ పిట్ట కథలు మరికొద్దిసేపట్లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిసోడ్ లో శృతిహాసన్ నటించింది. బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ కి రీమేక్ గా తెరకెక్కిన పిట్ట కథలు.. ఇంటర్వ్యూ లో భాగంగా శృతి హాసన్ తాను నటించిన టాలీవుడ్ హీరోలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. శృతి హాసన్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో నటించిన సంగతి తెలిసిందే. పవన్ గబ్బర్ సింగ్, మహేష్ శ్రీమంతుడు, అల్లు అర్జున్ రేసు గుర్రం, రవితేజ క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన శృతి హాసన్ తనతో కలిసి పని చేసిన హీరోల గురించి గుట్టు విప్పింది.
అల్లు అర్జున్ అధికంగా కష్టపడతాడని, పని పట్ల అల్లు అర్జున్ కి అంకిత భావం ఉంది అంటుంది. ఇక మహేష్ అయితే ఫుల్ ఎనెర్జీతో ఉండడమే కాదు.. మహేష్ గ్రెస్ ఫుల్ హీరో అంటుంది శృతి హాసన్. మహేష్ తో కలిసి నటించడం నా లక్కీ అంటుంది. ఇక రవితేజ తనకి ఫెవరెట్ హీరో అని, రవితేజ తో బలుపు, క్రాక్ మూవీస్ చేశా అని, తన హృదయంలో రవితేజాది ప్రత్యేకమైన స్థానం అంటుంది శృతి హాసన్. రవితేజ నాకెంతో ప్రత్యేకమైన వ్యక్తి అంటుంది. బలుపు టైం లో కెరీర్ ఆరంభంలో ఉన్న తనకి రవితేజ సపోర్ట్ మరవలేనిది అందుకే రవితేజకి నా మనసులో ప్రత్యేక స్థానం అంటూ చెప్పుకొచ్చింది. అన్నట్టు రవితేజ తో చేసిన క్రాక్ హిట్ రావడంతోనే శృతి హాసన్ కి ప్రభాస్ సలార్ పాన్ ఇండియా ఫిలిం లో అవకాశం కూడా దక్కింది.