గత కొంత కాలంగా అట్టర్ ప్లాప్ లతో కొట్టు మిట్టాడిన రవితేజకి ఒక్కసారిగా ఊపిరినిచ్చింది క్రాక్ సినిమా. ఆ సినిమా సక్సెస్ భారీ ఊరటనిచ్చింది. క్రాక్ సినిమా సక్సెస్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు రవితేజ. దానితో రవితేజ ఒక్కడే కాదు.. రాబోయే రవితేజ నెక్స్ట్ మూవీ నిర్మాతలు కూడా ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు.13 కోట్లు సింగిల్ పేమెంట్ రవితేజ కి ఇచ్చి.. దాదాపు 45 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్న ఖిలాడీ సినిమా ఎలా మార్కెట్ చేసుకోగలమా అని తంటాలు పడ్డ ప్రొడ్యూసర్స్ కి క్రాక్ సినిమా సక్సెస్ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా హ్యాపీగా ఖిలాడీ సినిమా మార్కెట్ అయ్యిపోతుంది.
నిజం చెప్పాలంటే క్రాక్ సినిమా సక్సెస్ అయ్యాక ఖిలాడీ సినిమా బడ్జెట్ ఇంకొంచెం పెరిగింది అని తెలుస్తోంది. అయితే అంతకు ముందు వీర సినిమాతో వీర ప్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ ని నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చిన రవితేజ నమ్మకాన్ని రమేష్ వర్మ నిలబెట్టుకోగలడా? అనేది సందేహం. గతంలో అయితే హరీష్ శంకర్ షాక్ సినిమాతో షాకింగ్ రిజల్ట్ ఇచ్చిన రవితేజకి మిరపకాయ్ హిట్ ఇచ్చి హరీష్ శంకర్, రవితేజని హ్యాపీ చేసాడు. అటు హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ లాంటి ఆఫర్ దక్కించుకున్నాడు. మరి రమేష్ వర్మకి అలాంటి ఆఫర్ మరోసారి దక్కింది.. రవితేజ ద్వారా. రమేష్ వర్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.