Advertisementt

మరో శిష్యుడి సినిమాకి మార్కెట్లో హైప్

Wed 17th Feb 2021 07:32 PM
sukumar,uppena,sukumar writings,18 pages,nikhil,surya pratap,anupama parameswaran  మరో శిష్యుడి సినిమాకి మార్కెట్లో హైప్
Hype in the market for another disciple movie మరో శిష్యుడి సినిమాకి మార్కెట్లో హైప్
Advertisement
Ads by CJ

ఉప్పెన పెద్ద హిట్ అవడంతో అటు హీరో హీరోయిన్స్ వైష్ణవ తేజ్ - కృతి శెట్టి కి ఎంత పేరొచ్చిందో.. ఇటు మైత్రి మూవీ మేకర్స్ కి, సుకుమార్ రైటింగ్స్ కి అంతే క్రేజ్ పెరిగింది. నిజానికి వెనక వరసలో ఉండిపోయింది మాత్రం దర్శకుడే. డైరెక్టర్ బుచ్చి బాబు ని కరెక్ట్ గా లైం లైట్ లోకి తీసుకురావడం లేదు. అయితే ఈ సినిమా మొత్తం సుకుమార్ కనుసన్నల్లో నడిచింది. సుకుమార్ చేయించాడు. ఉప్పెన సినిమా సుకుమార్ సినిమాగానే స్టాంప్ పడిపోవడం వలన ఉప్పెన సక్సెస్ క్రెడిడ్ ఎక్కువగా సుకుమార్ ఖాతాలోకే వెళ్ళిపోతుంది. ఈ దెబ్బతో నెక్స్ట్ సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చే సినిమాలకి కూడా ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. 

అప్పుడెప్పుడో కుమారి 21 F తో హిట్ కొట్టిన సూర్య ప్రతాప్ ని చాలా రోజులు గ్యాప్ లో ఉంచి ఉంచి ఇప్పుడు 18 పేజెస్ తో మళ్ళీ సినిమా చేపిస్తున్నాడు సుకుమార్. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా సూర్య ప్రతాప్ దర్శకుడిగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే ఇప్పుడు ఉప్పెన సక్సెస్ తో 18 పేజెస్ చిత్రానికి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే 18 పేజెస్ మూవీ కూడా సుకుమార్ రైటింగ్స్ లోనే తెరకెక్కతోంది కాబట్టి. మరి ఉప్పెన సక్సెస్ సెలెబ్రేషన్స్ అవీ చూస్తుంటే.. సుకుమార్ శిష్యుల హవా ఇండస్ట్రీలో ఇంకొంత కాలం కొనసాగేలాగే కనబడుతుంది.

Hype in the market for another disciple movie:

The craze for films from Sukumar Writings has also increased at once

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ