ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ పరంపర జోరుగా.. హుషారుగా సాగుతుంది. రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ తో అభిమానుల ముందుకు వచ్చిన ప్రభాస్ -రాధాకృష్ణ ల రాధేశ్యామ్ జులై 30 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసాడు. అంతేకాదు ఆదిపురుష్ కోసం ముంబై కూడా వెళ్ళిపోయాడు ప్రభాస్. ప్రభాస్ మరో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ అశ్విన్ అప్పుడప్పుడు ప్రభాస్ మూవీ అప్ డేట్స్ ఇస్తూ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. హీరోయిన్ గా దీపికా పదుకొనె పేరు ప్రకటించిన నాగ్ అశ్విన్ అంతలోనే అమితాబ్ ఓ కీ రోల్ ప్లే చెయ్యబోతున్నాడంటూ ప్రకటించాడు.
అలాగే జనవరి 29 న, ఫిబ్రవరి 26 న ప్రభాస్ మూవీ అప్ డేట్స్ అంటూ ఊరించాడు. జనవరి 29 న ప్రభాస్ - నాగ శ్విన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ అంటూ అప్ డేట్ ఇచ్చేసాడు. ఇక మిగిలింది ఫిబ్రవరి 26 న రావాల్సిన కొత్త అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ అప్పుడే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందులో ఒకరు ప్రభాస్ - నాగ్ అశ్విన్ అప్ డేట్ మరో పది రోజుల్లో రాబోతుంది అంటూ ట్వీట్ చెయ్యడంతో.. హడావిడిగా నాగ్ అశ్విన్ లైన్ లోకొచ్చి ఫిబ్రవరి 26 న ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇవ్వలేకపోతున్నామని.. అది సరైన సమయం కాదంటూ రిప్లై ఇవ్వడమే కాదు.. ప్రభాస్ ఫాన్స్ కి సారి కూడా చెప్పాడు. మరి నాగ్ అశ్విన్ కి ప్రభాస్ మూవీ అప్ డేట్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయో అర్ధంకావడం లేదు ప్రభాస్ ఫాన్స్ కి.