Advertisementt

మన మణిరత్నం తీసిన లవ్ స్టొరీ

Wed 17th Feb 2021 12:43 PM
kollywood director,mani ratnam,tollywood,sekhar kammula,love story,naga chaitanya,sai pallavi,fida movie,hyderabad historical palces  మన మణిరత్నం తీసిన లవ్ స్టొరీ
Love story taken by our Mani Ratnam మన మణిరత్నం తీసిన లవ్ స్టొరీ
Advertisement
Ads by CJ

దర్శకులందరికి ఓ ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఆ ముద్ర అనేది చూపించిన వ్యక్తి కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం. మనం ఇది మణిరత్నం సినిమాలా ఉంది అని చెప్పుకుంటాం ఓ సీన్ చూడగానే. అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన మణిరత్నం శేఖర్ కమ్ముల. ప్రతి సినిమాలోనూ తనదైన డైలాగ్స్ తో తనదైన మార్క్ చూపిస్తూ, తనదైన కేరెక్టరైజేషన్స్ తో, తనవైన సీన్స్ తో చాలా సహజత్వంతో సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల.. తన లాస్ట్ మూవీ ఫిదాతో ఎలాంటి ఎరుపులు మెరిపించాడో.. ఎలా ఆకట్టుకున్నాడో అందరికి తెలిసిందే.  తెలంగాణాకి అమెరికాకి ముడిపెట్టి.. అద్భుతమైన లవ్ స్టోరీని కనిపెట్టి ఒక మ్యాజిక్ చేసాడు. ఆడియన్స్ అందరిని ఫిదా చేసాడు. బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.

ఇప్పుడు మళ్ళీ సాయి పల్లవి - నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీతో అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చెయ్యబోతున్నాడు అనిపిస్తుంది. లవ్ స్టోరీ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్ ప్రోమోస్ చూస్తుంటే. కంప్లీట్ గా హైదరాబాద్ బేసిక్ లో లవ్ స్టోరీ తీసుకున్న శేఖర్ కమ్ముల.. రీసెంట్ గా రిలీజ్ చేసిన లవ్ స్టోరీ సాంగ్ లో హైదరాబాద్ లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటిని పొటరైట్ చేస్తూ ఆ సాంగ్ ని రిలీజ్ చెయ్యడం అందరిని ఆకట్టుకుంది. అలాగే లవ్ స్టోరీ లోని ఆ సాంగ్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంది. అలాగే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మ్యాజిక్ గనక మళ్ళీ రిపీట్ అయితే, చైతన్య - సాయి పల్లవిలా కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే లవ్ స్టోరీ తో మరో బిగ్గెస్ట్ హిట్ చూడడం ఖాయం. మళ్ళీ బాక్సాఫీసు కలెక్షన్స్ ఉప్పెన ఖాయం.

Love story taken by our Mani Ratnam:

Another big hit with Shekhar Kammula Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ