ఎప్పుడో ఏడేళ్ల క్రితం వచ్చిన క్వీన్ బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది. ఒక్కసారిగా కంగనా రనౌత్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది. ఇప్పుడు కంగనా చేస్తున్న చేష్టలన్నిటికి కూడా.. ఆ క్వీన్ అనే సినిమా సక్సెస్ పునాది అని చెప్పుకోవాలి. ఎందుకంటే కంగనాని నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ ని చేసిన సినిమా అది. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ ని సౌత్ లో రీమేక్ చేద్దామని చెప్పి మూడు లాంగ్వేజెస్ లో అట్టహాసంగా మొదలు పెట్టారు. తమిళ్ లో కాజల్ అగర్వాల్, తెలుగులో తమన్నా, కన్నడలో పరుల్ యాదవ్ లు హీరోయిన్స్ గా క్వీన్ రీమేక్స్ ని స్టార్ట్ చేసారు.
అన్ని భాషల్లోనూ క్వీన్ రీమేక్స్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి ఎప్పుడో రెడీ అయ్యిపోయాయి. తెలుగు క్వీన్ రీమేక్ లో అయితే వివాదాలు కూడా చెలరేగాయి. మధ్యలో దర్శకుడు నీలకంఠ తప్పుకోవడం, తర్వాత అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ క్వీన్ రీమేక్ ని పూర్తి చెయ్యడం వంటి వివాదాలు తెలుగు క్వీన్ రీమేక్ విషయంలో చెలరేగాయి. ఇక అన్ని భాషల్లో క్వీన్ రీమేక్ టీజర్స్ రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా తమిళ క్వీన్ టీజర్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే కాజల్ తీసుకున్న నెక్స్ట్ లెవల్ స్టెప్. అయితే ఇప్పటివరకు ఆ క్వీన్ రీమేక్స్ ఏ భాషల్లోనూ రిలీజ్ కాకపోవడం గమనార్హం. సౌత్ ఇండియా క్వీన్ ఏమైపోయింది.? ఎప్పుడు బయటికి వస్తుంది.? థియేటర్స్ లోకైనా, ఓటిటి కైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు క్వీన్ రీమేక్ విడుదల కాకుండా ఎందుకు ఆగిపోయింది?