Advertisementt

అల్లరి తగ్గింది.. ఆత్రుత పెరిగింది

Tue 16th Feb 2021 06:52 PM
allari naresh,allari movie,naandhi movie,mahrshi,comedy movies,performance movies  అల్లరి తగ్గింది.. ఆత్రుత పెరిగింది
Leapfrog decreased, Anxiety increased అల్లరి తగ్గింది.. ఆత్రుత పెరిగింది
Advertisement
Ads by CJ

అల్లరి సినిమాతో కామెడీ హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ కామెడీ చేస్తూనే కొన్ని రోజులు హీరోగా హ్యాపీ గా హల్ చల్ చేసినా అనుకోకుండా, అవలీలగా 50 సినిమాలు కంప్లీట్ చేసేసాడు. ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ హీరోల్లో నిజంగా 50 సినిమాలు కంప్లీట్ చేసిన ఘనత అల్లరి నరేష్ కే దక్కుతుంది. అయితే ఆ 50 సినిమాల్లో హిట్స్ ఎన్ని ఫట్స్ ఎన్ని అనేది పక్కన బెడితే.. అలా అల్లరి చేస్తూనే సరదా సరదాగా నెట్టుకొచ్చేసాడు.. అయితే అతని కామెడీ, ఆ స్పూఫ్ లు అన్ని టివి షోస్ లో కామెడీ అయ్యాయి. అసలు ఎప్పుడైతే టివి లోనే కామెడీ షోస్ ఎక్కువవడంతో.. బిగ్ స్క్రీన్ మీద కామెడీకి ఆదరణ తగ్గింది. 

ప్రేక్షకుల నుండి స్పూఫ్ లకి రియాక్షన్, రెస్పాన్స్ రావడం లేదు. దానితో తనని తాను పెరఫార్మర్ గా ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు అల్లరి నరేష్. మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నరేష్ రీసెంట్ చిత్రం నాంది సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా వర్కౌట్ అయ్యి నరేష్ నటుడిగా ప్రూవ్ అయితే హ్యాపీ. సక్సీడ్ అవ్వగలడు. లేదంటే మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోవాల్సి వస్తుంది. ఇక మీద పెరఫార్మెన్స్ కేరెక్టర్స్ చెయ్యాలా? కామిక్ కేరెక్టర్స్ చెయ్యాలా? అనే డౌట్ లోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. అందుకే అల్లరి నరేష్ లో అల్లరి తగ్గి ఆత్రుత పెరిగిపోయింది.

Leapfrog decreased, Anxiety increased:

Allari Naresh Naandhi release in feb 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ