Advertisementt

రామ్ చరణ్ ఫాన్స్ కి ఆ రోజు పండగే.!

Tue 16th Feb 2021 09:22 AM
ram charan,rrr,acharya,ram charan birthday,shankar project,rrr pan india movie,sidda as acharya,ram charan special treats  రామ్ చరణ్ ఫాన్స్ కి ఆ రోజు పండగే.!
That day is a festival for Ram Charan Fans! రామ్ చరణ్ ఫాన్స్ కి ఆ రోజు పండగే.!
Advertisement
Ads by CJ

ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంటైర్ సౌత్ ఇండియా మీడియా కి మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యిపోయాడు. ఒకవైపు రాజమౌళితో సినిమాతో చేస్తూ.. మరో పక్క టాప్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకోగానే..ఎక్కడ చూసినా రామ్ చరణ్ న్యూస్ కనబడుతుంది. దీనితో ఒక్కసారిగా మెగా ఫాన్స్ లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ ఉత్సాహం ఇంకో నెలలో ఇంకో పది రేట్లు పెరగబోతుంది. ఎందుకు అంటే మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి RRR నుండి బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. గత ఏడాది లాక్ డౌన్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు స్పెషల్ వీడియోతో మెగా ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు రాజమౌళి. ఈ ఏడాది కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫాన్స్ కి ట్రీట్ రెడీ కాబోతుంది. 

అంతేకాదు చిరంజీవి - కొరటాల శివ సినిమాలో సిద్ద క్యారెక్టర్ లో రామ్ చరణ్ తొలిసారి దర్శకనమివ్వబోతున్నాడు. ఈ రెండిటికి మెగా ఫాన్స్ కి ఉత్సాహం రెట్టింపైతే.. ఈ రెండింటితో పాటుగా దర్శకుడు శంకర్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్సమెంట్ తో పాటుగా ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన డీటెయిల్స్ కూడా అదే రోజు రాబోతున్నాయి. అంటే ఒకే రోజు రామ్ చరణ్ కి సంబందించిన మూడు సినిమా ట్రీట్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లబోతుంది. రామ్ చరణ్ దెబ్బకి. ఒక్క పాన్ ఇండియా ట్రీట్ కే మెగా ఫాన్స్ రెచ్చిపోయి సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. ఇప్పుడు రెండు పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా మరో క్రేజీ ఆచార్య మూవీ తో రామ్ చరణ్ మెగా ఫాన్స్ కి ఇచ్చే ట్రీట్స్ కి సోషల్ మీడియాని షేక్ చెయ్యడానికి మెగా ఫాన్స్ సిద్ధమవుతున్నారు.

That day is a festival for Ram Charan Fans!:

Ram Charan Birthday Special Treats

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ