మహానటి తర్వాత స్టార్ అవకాశాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ రంగ్ దే మూవీ తో పాటుగా మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తుంది. మహేష్ బాబు తో మొదటిసారి స్టార్ హీరో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్ కి ఇప్పుడు అవకాశాల జోరు మాములుగా లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బాగా బిజీ అయిన కీర్తి సురేష్ ప్రేమలో పడింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రేమలో మునిగి తేలుతుంది అని.. అనిరుధ్- కీర్తి జంట పక్షుల్లా విహరిస్తున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న అనిరుధ్ మీద చాలా ప్రేమ కథల గాసిప్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కీర్తి సురేష్ తో అనిరుధ్ ప్రేమ వ్యవహారం మాత్రం బాగా పాపులర్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ తన మ్యూజిక్ తో యూత్ ని ఉర్రుతలూగిస్తుంటాడు. మరి అనిరుధ్ - కీర్తి సురేష్ మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ న్యూస్ రావడం, మహానటి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ కి అటు కీర్తి సురేష్ కానీ ఇటు అనిరుధ్ కానీ స్పందించలేదు.