Advertisementt

నేను రోమియో టైప్ కాదంటున్న ప్రభాస్

Sun 14th Feb 2021 09:52 AM
prabhas,pooja hegde,radhakrishna,radhe shyam,radhe shyam glimpse,radhe shyam pan india movie  నేను రోమియో టైప్ కాదంటున్న ప్రభాస్
Radhe Shyam Glimpse Release నేను రోమియో టైప్ కాదంటున్న ప్రభాస్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ గా మారాక ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ మూవీస్ అప్ డేట్ కోసం తహతహలాడిపోతున్నారు. సాహో లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ చేసిన ప్రభాస్ ఈసారి మాత్రం ఓ చక్కటి లవ్ స్టోరీ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజంగా రాధేశ్యామ్ లుక్ చూసినా, ఆ స్టయిల్ చూసినా..ఆ కాస్ట్యూమ్స్ లో ప్రభాస్ ని చూసినా.. డార్లింగ్ ప్రభాస్ అనిపిస్తున్నాడు. డార్లింగ్ లానే ఉన్నాడు. ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ ని విడుదల చేసింది టీం. 

రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ లో ప్రభాస్ రొమాంటిక్ గా పూజ హెగ్డే వెంటపడుతున్న అబ్బాయిలా కనిపిస్తే పూజ హెగ్డే చాలా స్టైలిష్ గా గ్లామర్ గా అదరగొట్టేస్తుంది. తన వెంటపడుతున్న ప్రభాస్ ని నువ్వేమన్నా రోమియోవి అనుకుంటున్నావా అంటే.. దానికి ప్రభాస్ వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేనా టైప్ కాదు అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ కట్ చేసారు. భారీ హంగామా, రిచ్ నెస్, ప్రభాస్ రొమాంటిక్ లుక్స్, పూజ హెగ్డే గ్లామర్  తో రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ ప్రభాస్ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.

Click Here to: Radhe Shyam Teaser

Radhe Shyam Glimpse Release:

Prabhas-Pooja Hegde-Radhakrishna Radhe Shyam Glimpse Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ