రామ్ చరణ్ - శంకర్ కాంబోలో మూవీ ప్రకటన వచ్చిన దగ్గరనుండి ఆ సినిమాపైన ఇండస్ట్రీలో చర్చలు మొదలైపోయాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఏ టాలీవుడ్ దర్శకుడితోనో సినిమా చేస్తాడనుకుంటే.. డైరెక్ట్ గా కోలీవుడ్ శంకర్ తో సినిమా ప్రకటించి షాకిచ్చాడు. దీనిని లైన్ లో పెట్టడానికి దిల్ రాజు శంకర్ చుట్టూ తిరిగాడు. భారతీయుడు2 సినిమానే నిర్మించాల్సిన దిల్ రాజు అప్పట్లో ఎందుకో వెనక్కి తగ్గినా. ఇప్పుడు రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ కోసం మళ్ళీ దిల్ రాజు శంకర్ చెంతకే చేరాడు. రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా మూవీ ప్రకటన రావడమే తరువాతి మెగాస్టార్ చిరు లైన్ లోకొచ్చేసారు.
తన కొడుకు చరణ్ భారతీయ సినిమాను మరో మెట్టు పైకెక్కించే సత్తా ఉన్న దర్శకులతో పని చెయ్యడం సంతోషం గా ఉందని.. చేయి తిరిగిన సినీ దర్శక నిపుణుడు, దార్శనికుడు, ప్రతిభను సరిహద్దులు దాటించిన శంకర్ తో రామ్ చరణ్ సినిమా చెయ్యడం పట్ల ఆయన చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రామ్ చరణ్ తో శంకర్ అనగానే తనకి ఎంతో థ్రిల్ ని కలగజేసింది అంటూ రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా మూవీ పై చిరు తన స్పందన తెలియజేసారు. అలాగే రామ్ చరణ్ కెరీర్ లోని RC15, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న 50వ చిత్రానికి గుడ్ లక్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరి భారీ బడ్జెట్ తో భారీ విజువల్ సెటప్ తో దిల్ రాజు రామ్ చరణ్- శంకర్ సినిమాని నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.