Advertisementt

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్వేస్ ఆన్ ఫైర్.!

Fri 12th Feb 2021 09:31 PM
pawan kalyan,ak remake,krish movie,fan made postyers,pawan kalyan fans,social media,fire  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్వేస్ ఆన్ ఫైర్.!
Power Star Fans on Fire! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్వేస్ ఆన్ ఫైర్.!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తూ ఎలా బిజీగా ఉన్నారో..పవన్ కళ్యాణ్ ఫాన్స్ తన ప్రతి సినిమా స్టిల్స్ ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో అంతే బిజీగా ఉంటున్నారు. అటు పొలిటికల్ మీటింగ్ అవ్వనివ్వండి.. ఇటు సినిమా షూటింగ్ లో అభిమానులను మీటయినా కానీ ఏ ఫోటో బయటికొచ్చినా అది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోవడం ఖాయమైపోయింది. అలాగే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ఊహించేసుకుంటూ.. పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో శేఖర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏకే రీమేక్ కి రుద్రా అనే టైటిల్ పెట్టి వాళ్ళకి వాళ్ళే ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ క్రియేట్ చేసేసుకున్నారు.

అలాగే క్రిష్ - పవన్ కాంబోలో రాబోతున్న సినిమాకి కూడా వాళ్ళకి వాళ్ళే ఫోటో షాప్ లో డిజైన్ చేసేస్తూ ఫ్యాన్ మెడ్ పోస్టర్ ని క్రియేట్ చేసుకుని వాటినే వైరల్ చేసుకుంటున్నారు. అధికారికంగా మేకర్స్ నుండి అనౌన్సమెంట్ వచ్చేవరకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఆరాటం ఆగడం లేదు. క్రిష్ సినిమాకి హరిహర వీరమల్లు, హరహర మహాదేవ టైటిల్స్ ప్రచారంలోకి రాగానే పవన్ కళ్యాణ్.. క్రిష్ మూవీ ఫస్ట్ లుక్ పై ఆ టైటిల్స్ వేసి పోస్టర్స్ గా మర్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు. అందుకే అనేది పవర్ స్టార్ పవన్ ఫాన్స్ ఆల్వేస్ ఆన్ ఫైర్ అని.!

Power Star Fans on Fire!:

Pawan Kalyan upcoming movies fan made posters on fire

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ