Advertisementt

రిలీజ్ అవ్వట్లేదు.. రిలాక్స్ అవ్వట్లేదు

Fri 12th Feb 2021 07:15 PM
kalyan dev,sridhar sripana,sreeja,chiru,sun in law,super machhi,kinnerasani  రిలీజ్ అవ్వట్లేదు.. రిలాక్స్ అవ్వట్లేదు
Not released, Not relaxed రిలీజ్ అవ్వట్లేదు.. రిలాక్స్ అవ్వట్లేదు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా మారిన కళ్యాణ్ దేవ్ మెగా కాంపౌండ్ అండతో హీరోగా కూడా లాగించేద్దాం అనుకున్నాడు. అయితే తన మావయ్య చిరు హిట్ సినిమా టైటిల్ విజేతని పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చినా..ఆశించిన ఫలితం దక్కలేదు. అలాగని కళ్యాణ్ దేవ్ నిరాశపడలేదు. తన పట్టుదల వెరవలేదు. కళ్యాణ్  దేవ్ ని హీరోగా నిలబెట్టాలనే తాపత్రయం తనకంటే కూడా కళ్యాణ్ దేవ్ సతీమణి శ్రీజ కి ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇమ్మిడియట్ గా సూపర్ మచ్చి అనే సినిమా చేసారు. అది ఇప్పటికే అంటే కరోనా కన్నా ముందే షూటింగ్ కంప్లీట్ అయిపోయినా.. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది.

ఆపై ఆగకుండా మరో సినిమాని కూడా కంప్లీట్ చేసేసాడు కళ్యాణ్ దేవ్. రామ్ తాళ్లూరి బ్యానర్ లో కిన్నెరసాని షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ స్టేజ్ లో ఉంది. అవి రెండూ పూర్తయ్యాయి అనుకుంటే.. ఇప్పుడు మరో సినిమాని కూడా మొదలు పెట్టేసాడు కళ్యాణ్ దేవ్. శ్రీధర్ శ్రీపాన డైరెక్షన్ లో మరో సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుపుకుంటుంది. కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న గ్లిమ్బ్స్ లాంటిది వదిలారు. అందులో తన భర్త ని శ్రీజ డైరెక్షన్ చెయ్యడం విశేషం. యాక్షన్, కట్ చెబుతూ అందులో శ్రీజ కూడా కనిపించింది. లెంతి హెయిర్, గెడ్డం తో కాస్త రెట్రో లుక్ ట్రై చేసాడు కళ్యాణ్ దేవ్. సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా.. తాను మాత్రం బిజీగా వరసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు.

మరి మెగా ప్లానింగ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఈ సినిమాలన్నిటిని ఎప్పుడు దింపుతారో చూడాలి. ఏది ఏమైనా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న కళ్యాణ్ దేవ్ కి సినీ జోష్ టీం తరుపున హ్యాపీ బర్త్ డే.

Not released, Not relaxed:

KALYAN DEV BIRTHDAY TEASER

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ