Advertisementt

ఆఫీషియల్: చరణ్ - శంకర్ మూవీ కన్ఫర్మ్

Fri 12th Feb 2021 05:28 PM
shankar,ram charan,dil raju,sri venkateswara creations,pan india movie,rc15,confirmed  ఆఫీషియల్: చరణ్ - శంకర్ మూవీ కన్ఫర్మ్
It's Official: Ram charan - Shankar combo pan india movie ఆఫీషియల్: చరణ్ - శంకర్ మూవీ కన్ఫర్మ్
Advertisement
Ads by CJ

వచ్చింది. అది దిల్ రాజు నిర్మాతగా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ. ఈ కాంబో సెట్ చెయ్యడానికి దిల్ రాజు చెన్నై వెళ్ళాడు. అక్కడ దర్శకుడు శంకర్ తో సంప్రదింపులు జరిపి చరణ్ తో శంకర్ మూవీ ఫిక్స్ చేసాడు. బడ్జెట్ వగైరా విషయాలను అన్ని చర్చించి అధికారికంగా RC15 పై ప్రకటన విడుదల చేసారు.

భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ని దిల్ రాజు సెట్ చేసాడు. కొద్దీ నిమిషాల క్రితమే దిల్ రాజు - శంకర్ - రామ్ చరణ్ కాంబో RC15 అధికారిక ప్రకటన వచ్చేసింది. రామ్ చరణ్ RRR తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో.. అది పాన్ ఇండియా ఫిలిం లేదా మరేదన్నా మాస్ మూవీ నా అనే అనుమానాలకు, సందేహాలకు నేటితో శుభం కార్డు పడింది. ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా ఫిలిం తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా ఫిలిం ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దర్శకుడు శంకర్ తో చేతులు కలిపాడు. దానికి కర్త కర్మ క్రియ అన్నటుగా దిల్ రాజు వ్యవహరించాడు. అన్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకమైన 50 వ చిత్రం అవుతుంది.

నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ.. సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు ద‌శాబ్దాల‌వుతుంది. ఈ జ‌ర్నీలో మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుంచి స్టార్ హీరోల‌తో, అప్ క‌మింగ్, డెబ్యూ హీరోల‌తో, ద‌ర్శ‌కుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 50వ సినిమాను మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ గారితో నిర్మిస్తున్నాం. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న‌ 15వ చిత్ర‌మిది. ద‌క్షిణాది సినిమా స్థాయిని ఇటు స‌బ్జెక్ట్ ప‌రంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లిన‌ భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌నున్నాం. చ‌ర‌ణ్‌, శంక‌ర్ వంటి  క్రేజీ కాంబినేష‌న్‌లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. సినీ ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం.  త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం

It's Official: Ram charan - Shankar combo pan india movie :

Shankar - Ram Charan - Dil raju Pan India Movie confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ