ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలను నిర్బహించిన SEC నిమ్మగడ్డ పై వైసిపి నేతలు, మంత్రులు పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు. అందుకు అనుగుణంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వైసిపి నేతల పై చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా మంత్రి పెద్దిరెడ్డి ని ఇంటికి పరిమితం చెయ్యాలని, మీడియా తో మాట్లాడకూడదు అంటూ నిమ్మగడ్డ ప్రతిపాదనని తోసిపుచ్చి పెద్దిరెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ నిమ్మగడ్డ చర్యలను కోర్టు తప్పుబట్టడంతో వైసిపి కి కాస్త ఊరట కలిగింది.
అయినా వైసీపీ మంత్రులు నిమ్మగడ్డను దూషించడం మానలేదు. తాజాగా కొడాలి నాని ఓ ప్రెస్ మీట్ లో మీడియా ఎదుట SEC నిమ్మగడ్డని అసభ్య పదజాలంతో దూషించడతో నాని కి SEC షోకాజు నోటీసు లు పంపింది. చంద్రబబు కి పిచ్చి పరాకాష్టకు వెళ్ళింది. నారా లోకేష్ చిత్తూరులో పంచాయితీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలి పోతానంటూ ఛాలెంజ్ చేసిన నాని.. SEC ని పరుష పద జాలంతో దూషించడంతో కొడాలి నానికి SEC షోకాజు నోటీసులు ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని, వ్యక్తిగతంగా అయినా, లేదంటే తమ తరుపున ప్రతినిధి కానీ వివరణ ఇవ్వాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సివస్తుంది అంటూ కొడాలి నానికి నోటీసులు పంపింది SEC.