నిన్నటి నుండి సోషల్ మీడియాలో దిల్ రాజు నిర్మాతగా శంకర్ - రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ అంట. అందుకోసమే దిల్ రాజు చెన్నై లో మకాం పెట్టి శంకర్ తో మంతనాలు జరుపుతున్నాడట.. మరి కాసేపట్లో చరణ్ - శంకర్ క్రేజీ కాంబో పై అధికారిక ప్రకటన రాబోతుంది అంటూ ఒకటే న్యూస్ చక్కర్లు కొడుతోంది. RC15 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ అండ్ ఆచార్య తర్వాత దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ తో సినిమా సెట్ చేసుకోబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. రామ్ చరణ్ అంగీకారంతోనే దిల్ రాజు చెన్నై ఫ్లైట్ ఎక్కాడని, దర్శకుడు శంకర్ ని కలిసి చర్చలు జరుపుతున్నాడని కోలీవుడ్-టాలీవుడ్ మీడియా లు కోడై కూస్తున్నాయి.
దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని నిర్మించేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నాడట. మరి శంకర్ తో భారీ బడ్జెట్ అంటే అది మాములు యవ్వారం కాదు. ముందు 300 కోట్లు అంటూ దిగితే అది కాస్త 400 కోట్లు దాటినా ఆశర్యపోవక్కర్లేదు. అయినా చరణ్ కూడా శంకర్ కాంబోపై ఇంట్రెస్ట్ గా ఉండడంతో దిల్ రాజు రంగంలోకి దిగాడట. చరణ్ కూడా ఈ సినిమాలో కొణిదెల ప్రొడక్షన్స్ నుండి వాటా పెడతానని దిల్ రాజుకి మాటిచ్చినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు శంకర్ - రామ్ చరణ్ కాంబో లో మూవీ అంటే అంచాలు తారా సాయిలో ఉంటాయి. అందుకే ఈ క్రేజీ కాంబోపై ఎంత బడ్జెట్ పెట్టాలనే దాని మీద ఇంకా చెన్నై లో బేరాలు నడుస్తున్నట్టుగా.. ఏ క్షణమైన ఆ డీల్ సెట్ అయ్యి రామ్ చరణ్ - శంకర్ క్రేజీ కాంబో పై ఆఫీషియల్ ప్రకటన రావొచ్చని సమాచారం..