ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో పూజా కార్యక్రమాలతో ఆదిపురుష్ సినిమా గత వారమే ప్రారంభమైంది. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ కి సంబందించిన ఓ సాంగ్ చిత్రకరణ మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఇప్పటికే పూజ హెగ్డే రాధేశ్యామ్ డబ్బింగ్ కూడా చెప్పేసింది. ఇక రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాల మొదలు పెడుతున్నా తరుణంలో ప్రభాస్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ కి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. మూడు సినిమాల షూటింగ్ లను రెండు చేతులతో చక్కబెడుతున్న ప్రభాస్ కి ఇప్పుడు ఆదిపురుష్ బ్రేకులు వేసింది. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఓం రౌత్ ప్రభాస్ వచ్చే టైం కి ఆదిపురుష్ కీలక సన్నివేశాల కోసం ఓ భారీ సెటప్ రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. కానీ ఆదిపురుష్ ఓపెనింగ్ రోజున ఆదిపురుష్ సెట్ లో జరిగిన అగ్నిప్రమాదంతో ఓం రౌత్ ప్లాన్స్ అన్ని పక్కకి వెళ్లాయి.
ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ కోసం ఆదిపురుష్ టీం ఆధునిక టెక్నలాజి వాడుతుంది. ఆదిపురుష్ సీన్స్ సహజ సిద్ధంగా రావడానికి మోడ్రెన్ టెక్నలాజిని ఉపయోగిస్తున్నారట. అయితే ఇప్పుడు షూటింగ్ కి సంబందించిన ముఖ్యమైన పరికరాలు ఆదిపురుష్ సెట్స్ దగ్దమైనప్పుడు దెబ్బతిన్నాయట. ఇప్పుడు మళ్ళీ వాటిని తెప్పించడానికి కాస్త టైం పడుతుందట. విదేశీ పరికరాల కోసం ఆదిపురుష్ టీం వెయిట్ చెయ్యడంతో ఆదిపురుష్ షూటింగ్ కాస్త ఆలస్యం కానుందనేది తాజా సమాచారం. సలార్ తర్వాత ఆదిపురుష్ కి డేట్స్ అడ్జెస్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ చిత్రీకరణ లేట్ అవడంతో ఆ డేట్స్ అటు సలార్ కోసం ఇటు రాధేశ్యామ్ పబ్లిసిటీ కార్యక్రమాల కోసం, మరోపక్క నాగ్ అశ్విన్ మూవీ కోసం ప్రభాస్ వాడుకోబోతున్నాడట.