మన తెలుగమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి కి ఫెమినా మిస్ ఇండియా 2020 కిరీటం దక్కడం గర్వకారణం. సాధారణంగా సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే మానస వారణాసి గురించి కొన్ని విషయాలు మీ కోసం.. ముందు నుండి ఎవరితో కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడంతో దాని నుండి బయటపడేందుకు మానస వారణాసి భారత నాట్యంలో శిక్షణ తీసుకుందట. హైదరాబాద్ లోని వాసవి ఇంజీరింగ్ కళాశాలలో డిగ్రీ పట్టా తీసుకున్న మానస వారణాసి.. కాలేజ్ చదివే రోజుల్లోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిం ట. చదువుకుంటున్నప్ప్పుడే అందాల పోటీల్లో పాల్గొని.. ఫస్ట్ ప్రైజెస్ గెలిచిన మానస వారణాసి జీవితంలో ముగ్గురు మహిళలు వలన స్ఫూర్తి పొందినట్లుగా ఓ ఇంటర్వ్యూ లో మానస చెప్పారు. తన బామ్మ, సోదరి, అమ్మ వలన తాను చాలా స్ఫూర్తి పొందినట్లుగా చెప్పింది. ఇక ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లు తాగి తన దిన చర్యని ప్రారంభిస్తా అని, మనసులో ఆందోళనలాంటివి ఉన్నప్పుడు సంగీతం వింటూ రిలాక్స్ అవుతా అంటూ మానస వారాణసి చెప్పుకొచ్చింది.