2020 సంక్రాంతి సీజన్ మన తెలుగు సినిమాల ఫైట్ ని ఎవరూ మరిచిపోలేరు. ఎందుకంటే కరోనా రాకముందు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి బూమ్ ఇచ్చిన సీజన్ అది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు నువ్వా- నేనా అంటూ పోటాపోటీగా ఆడాయి. చకచకా ఎవరికి రావాల్సిన రెవిన్యూ వాళ్ళు రప్పించుకున్నారు. అవే అలా వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు. రిలీజ్ డేట్స్ దగ్గరనుండి లాస్ట్ లో రెవిన్యూ వరకు ఎక్కడిక్కడ అటు ఫాన్స్ మధ్య, ఇటు రికార్డ్స్ విషయంలో ఒక కోల్డ్ వార్ జరిగినా.. కొన్ని కాంట్రవర్సీసీలు చెలరేగినా.. అల్టిమేట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచే జరిగింది. ఒకే సీజన్ లో రెండు బిగ్గెస్ట్ హిట్స్ దొరోకాయి. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా తో దెబ్బతగిలింది. అది వేరే విషయం.
విశేషం ఏమిటి అంటే సరిలేరు నీకెవ్వరూ సినిమా మ్యూజిక్ విషయంలో కాస్త డిస్పాయింట్ అయిన మహేష్ బాబు, అలా వైకుంఠపురములో హిట్ కి మ్యూజిక్ ఏ పెద్ద అస్సెట్ అని ఫీలయ్యి ఎట్టి పరిస్తితుల్లోనూ తన సర్కారు వారి పాటకు థమన్ కావాలని పెట్టించుకున్నాడు. అటు పాన్ ఇండియా ఫిలిం పుష్ప చెయ్యబోతున్న బన్నీ.. సుకుమార్ ఆస్థాన విద్వాంసుడు దేవి శ్రీ ప్రసాద్ తమ రెగ్యులర్ కాంబోనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్.. ఒకరు ఆ హీరోకి, ఒకరు ఈ హీరోకి ఎక్స్ చేంజ్ అయ్యారు. సో ఇది ఎలాంటి రిజెల్ట్ ఇస్తుందో.. పుష్ప, సర్కారు వారి పాట సినిమాల్లో ఈసారి మ్యూజిక్ పరంగా ఎవరిది పై చెయ్యి సాధిస్తుందో చూడాలి.