ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు ఉండేవారు. డిస్ట్రిబ్యూషన్ రేట్లు, హీరోల రెమ్యునరేషన్ దగ్గరనుండి అన్నిటిని ఏదో చూసుకునే వాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా హీరోల రెమ్యునరేషన్స్ పెరిగాయి. సినిమాల ప్రొడక్షన్స్ కాస్ట్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది. అంతవరకూ అన్ని హ్యాపీనే. అయితే ఫైనల్ గా ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది అంటే ఆడియన్స్ మీదే. మొన్న సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలకే థియేటర్స్ యాజమాన్యం అడ్డగోలుగా 200 రూపాయల టికెట్స్ రేట్స్ పెట్టారు. కనీసం అది నిలదీసే నాధుడు లేడు..అడిగే దిక్కూ లేదూ. రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఓకె. ప్రొడక్షన్ చేసే ప్రొడ్యూసర్స్ ఓకె. డిస్ట్రుబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ఓకె.
ఈ బర్డెన్ మొత్తం మోయాల్సింది ఎవరు. ఎవరి భుజాల మీదకి ఎత్తుతున్నారు. ప్రశ్నించేవాడు లేడా? ఇప్పుడు ప్రస్తుతానికి 150 టికెట్ రేటు అంటారు. రేపు ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ రిలీజ్ అవగానే, పెద్ద సినిమా అంటారు. టికెట్ రేటు పెంచుతారు. మళ్ళీ 200 రూపాయల యూనిఫామ్ టికెట్ రేటు వచ్చేస్తుంది. వకీల్ సాబ్, నారప్ప లాంటి సినిమాలకే టికెట్ రేట్స్ పెంచేస్తే.. బిగ్ బడ్జెట్ మూవీస్ అయిన ఆచార్య, రాధేశ్యాం వాటి పరిస్థితియేమిటి. వీటన్నిటిని మించిన ఎక్సట్రార్డినరీ ప్రాజెక్ట్ అయిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ టికెట్స్ రేటు ఏ రేంజ్ కి వెళ్ళిపోతుంది. తీసేది మీరు. చేసేది మీరు. మోసేది జనమా?