ప్లాప్స్ లో ఉన్న రామ్ కి, అట్టర్ ప్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాధ్ కి కంబైన్డ్ గా అనుకోకుండా తగిలేసిన లాటరీ, ఎక్సట్రార్డినరీ విక్టరీ ఇస్మార్ శంకర్ చాలా పెద్ద హిట్ అయ్యి, ఇద్దరికీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా. అటు యూత్ ని ఇటు మాస్ ఊపేసింది. ఒక్కదెబ్బతో పూరి జగన్నాధ్ పాన్ ఇండియా ఫిలిం వైపు అడుగులు వేస్తె.. రామ్ రెడ్ రీమేక్ లో డ్యూయెల్ రోల్ చెయ్యడానికికి రెడీ అయ్యాడు. అయితే రామ్ స్పీడు కి రెడ్ సినిమా మాత్రం బ్రేకులు వేసేసింది. అటు కంప్లీట్ మాస్ చెయ్యాలా? లేదా యూత్ఫుల్ ఫిలిం చెయ్యాలా? సెటిల్డ్ గా లవర్ బాయ్ లా చెయ్యాలా? ఎలా చెయ్యాలి అని కంప్లీట్ గా డైలమాలో నెట్టేసింది.
ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ఏం చూజ్ చేసుకోవాలి. ఎలాంటి డైరెక్టర్ ని చూజ్ చేసుకోవాలి. ఎలాంటి బ్యాగ్డ్రాప్ లో.. ఎలాంటి సినిమా చెయ్యాలి. అర్ధం కానీ ఒక అయోమయం. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన్ ఇమేజ్ ని కాపాడుకోవాలా? దాన్ని కంటిన్యూ చెయ్యాలా? లేదూ కొత్త ఇమేజ్ ట్రై చెయ్యాలా? కొత్త బ్యాగ్డ్రాప్ కి వెళ్లాలా? ఇలా చాలా సందిగ్ధంలో ఉన్నాడు రామ్. ఇప్పుడు మరి మళ్ళీ తనని సరైన దారిలో పెట్టి, రామ్ కి సరైన సినిమా ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.