Advertisementt

నాగార్జున సైలెన్స్ కి రీజన్ అదేనా.?

Wed 10th Feb 2021 08:36 PM
nagarjuna,bangarraju movie,praveen sattaru,bigg boss,nag wild dog  నాగార్జున సైలెన్స్ కి రీజన్ అదేనా.?
Is there a reason for Nagarjuna's silence? నాగార్జున సైలెన్స్ కి రీజన్ అదేనా.?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 కంప్లీట్ అయ్యాక కంప్లీట్ గా సైలెంట్ అయ్యిపోయారు నాగార్జున. అప్పటివరకు అటు వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్ తోనూ ఇటు బిగ్ బాస్ అప్ డేట్స్ తోనూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా లేదూ.. టివి మీడియాలో యాక్టీవ్ గా ఉండే నాగార్జున కొన్నాళ్లుగా కంప్లీట్ గా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే అప్పటినుండి ఆయన బయట కనిపించింది కూడా చాలా తక్కువ. బిగ్ బాస్ జరుగుతున్న టైం లో చిరు - నాగ్ కేసీఆర్ ని కలవడం తప్ప సినిమాల పరంగా నాగార్జున మీడియా ముందుకు వచ్చిందే లేదు. ఆయన్ని చూసిందే లేదు. అలా అని తన తదుపరి చిత్రాల షూటింగ్ విషయంలో బిజీగా ఉన్నారా అంటే..ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిన బంగార్రాజుని వెయిటింగ్ లో పెట్టారు.

కథం మొత్తం నచ్చినా ఇంకా ప్రవీణ్ సత్తారు సినిమాని కన్ఫర్మ్ చెయ్యకుండా హోల్డ్ లో పెట్టారు. వైల్డ్ డాగ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా.. ఒటిటి రిలీజ్ కే బెటర్ అనే సజెషన్ ఇచ్చేసి.. ఇక ఆ సినిమాకి తనకి ఎలాంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. నాగార్జున ఇంత సైలెంట్ అవ్వడానికి కారణం ఏమిటి అనేది అక్కినేని ఫాన్స్ కి అస్సలర్ధం కావడం లేదు. నిజానికి నాగార్జున అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటి అంటే.. ఆయన బ్యాక్ పెయిన్ తో విపరీతంగా బాధపడుతున్నారట. ఆ బ్యాక్ పెయిన్ తాలుకు ట్రీట్మెంట్ లో ప్రస్తుతం నాగ్ బిజీగా ఉన్నారట. సో ఆ ట్రీట్మెంట్ అయ్యిపోయే టైం కి ఈ కరోనా పరిస్థితులు కూడా చక్కబడతాయి. 

అప్పుడు తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి డెసిషన్ తీసుకుందాం అని అవన్నీ పక్కనబెట్టి ప్రస్తుతం తనకున్న బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే బ్యాక్ పెయిన్ తాలూకూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనేది సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. అభిమానులు అర్ధం చేసుకోండి. ఎక్కువ ఇబ్బంది పెట్టకండి.

Is there a reason for Nagarjuna's silence?:

Nagarjuna is suffering from back pain

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ