కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయ్యాక.. ఈ అందమైన చందమామకి అనుకోకుండానే అదృష్టం దక్కింది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆల్ లాంగ్వేజెస్ తనదైన ఉనికిని చాటుకోగలిగింది. ఇక్కడ కెరీర్ ని పక్కనబెట్టేస్తే.. పర్సనల్ లైఫ్ లోను కాజల్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. తాను తొందరపడకుండా ముందు తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చక్కగా చేయించి సరైన టైం లో సరైన వరుడిని ఎంచుకుని పెళ్లి చేసుకుంది.. హ్యాపీగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ హనీమూన్ కి మాల్దీవులకు వెళ్ళొచ్చింది. అలా అని కెరీర్ లో వెనకబడిందా అంటే అది లేదు.
ఇక్కడ మెగా స్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తుంది. కోలీవుడ్ లో కమల్ హాసన్ తో ఇండియన్ 2 లాంటి బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. మంచువారి మోసగాళ్లు లో మంచి కేరెక్టర్ చేసింది. ఓటిటిలో ఎంటర్ అవడమే లైవ్ టెలికాస్ట్ తో ఎంటర్ అయ్యింది. ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చే స్టార్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ సమంత అవుతుంది అనుకుంటే.. సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ వెనక్కి వెళ్లడం కాజల్ అగర్వాల్ చేసిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సీరీస్ ముందుకొచ్చేయ్యడంతో కాజల్ నటించిన వెబ్ సీరీస్ ఫిబ్రవరి 12 న టెలికాస్ట్ కాబోతుంది. ఏది ఏమైనా కాజల్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటున్నట్టే. బహుశా అన్ని తనకి బాగా కలిసొస్తున్నాయ్ అనుకోవాలో.. లేక తన ప్లానింగ్ అలా వర్క్ అవుట్ అవుతోందో.! ఎనీ వే ఆల్ ద బెస్ట్ కాజల్.