టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు - నమ్రతల 16 ఏళ్ళ ప్రేమకు గుర్తుగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ విషెస్ చెప్పుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఫ్లైట్ లో నమ్రతకు ముద్దు పెడుతున్న ఫోటో ని షేర్ చేస్తూ.. Happy 16th NSG. 💕 To forever and beyond with you అంటూ ట్వీట్ చెయ్యగా.. నమ్రత కూడా మహేష్ కి ముద్దు పెడుతున్నా ఫోటో ని షేర్ చేస్తూ.. వివాహం తరువాత 16 సంవత్సరాలు ఎంతో వేగంగా గడిచాయి. బలమైన ప్రేమతో పాటు నమ్మకాల కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే అంటూ ట్వీట్ చేసింది.
మహేష్-నమ్రతల పెళ్ళై నేటికీ అంటే ఫిబ్రవరి 10 కి 16 ఏళ్ళు గడిచాయి. గౌతమ్, సితార ఇద్దరు పిలల్లతో మహేష్ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నమ్రతని ఎంతగానో ప్రేమించే మహేష్ కాస్త తీరిక దొరికినా ఫ్యామిలీకి టైం కేటాయిస్తారు. చిన్నపాటి బ్రేక్ వచ్చినా వెకేషన్స్ కోసం సింగపూర్, దుబాయ్, అమెరికా లాంటి ప్లేస్ లకు వెళ్ళిపోతారు. నమ్రత పుట్టిన రోజున, పిల్లలు పుట్టిన రోజున స్పెషల్ పిక్స్ తో విషెస్ చెప్పే మహేష్ నేడు పెళ్లి రోజున తనకిష్టమైన మంచి పిక్ తో నమ్రతకు విషెస్ తెలియజేసాడు. ప్రస్తుతం మహేష్ - నమ్రతల పెళ్లిరోజున సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ పిక్స్ ని మహేష్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈ క్యూట్ కపుల్ కి మనము బెస్ట్ విషెస్ చెప్పేద్దాం.