లక్కీ బ్యూటీ రష్మిక, అల్లు అర్జున్ తో పాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ లో బిజీగా వుంది. సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో రష్మిక డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది అనే టాక్ ఉంది. గత రెండు నెలలుగా రంపచోడవరం, మారేడుమిల్లు అడవి ప్రాంతంలో షూటింగ్ చిత్రీకరణలో పుష్ప యూనిట్ తలమునకలై.. రీసెంట్ గా ఆ భారీ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ కి చేరుకుంది. అల్లు అర్జున్ తో ఫస్ట్ టైం నటిస్తున్న రష్మిక తెగ ఎగ్జైట్ అవుతుంది. అల్లు అర్జున్ తో కలిసి నటించడం చాలా స్పెషల్ గా ఉంది అని, బన్నీ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన అల్లు అర్జున్ తో నటించడం చాలా సులభం అంటుంది. ఆన్ స్క్రీన్ లో తమ మధ్యన కెమిస్ట్రీ చాలా బావుంటుంది అంటుంది.
ఇప్పటివరకు రష్మిక నటించిన చిత్రాల్లో పుష్ప చాలా భిన్నంగా ఉండబోతుందట. అటవీ ప్రాంతంలో చిత్రీకరణ కారణంగా పుష్ప షూటింగ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెబుతుంది రష్మిక. తెల్లవారు ఝామున 4 గంటలకు నిద్రలేచి.. షూటింగ్ లొకేషన్ కి వెళ్లిన వాళ్ళం ఏ రాత్రి 10 గంటలకో మల్లి మేము స్టే చేసిన ప్లేస్ కి చేరుకొని ఫ్రెష్ అయ్యి, వర్కౌట్స్ చేసి పడుకునేసరికి 12 అవుతుంది. మళ్లీ 4 గంటలకు లేచి షూటింగ్ కి వెళ్ళిపోతున్నాం. నేను పడుకునే సమయం రోజుకి కేవలం 4 గంటలే. అంతేకాకుండా పుష్ప సినిమాలో నాకు స్పెషల్ మేకప్ అవసరం అవుతోంది. దానికోసం దాదాపుగా రెండు గంటలు వెచ్చించాల్సివస్తోంది. ఇదొక ఛాలెంజ్ లాంటిది. అయినా, రేపు స్క్రీన్ మీద మంచి రిజల్ట్ వస్తుందిలెండి.. అంటూ పుష్ప సినిమా తనకి నిద్రని దూరం చేసిన విషయం చెప్పుకొచ్చింది.