పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భాగంగా ఢిల్లీ పర్యటనలో బిజెపి పెద్దలని కలిసే ప్రోగ్రాం లో బిజీగా ఉన్నారు. అమిత్ షా తో పవన్ భేటీ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ తో బాగా బిజీగా వున్న పవన్ కళ్యాణ్ కి మహా శివరాత్రి బాగా కలిసొచ్చిన పండగ. పదేళ్లు ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న పవన్ కళ్యాణ్ నుంచి గబ్బర్ సింగ్ టీజర్ అనేది మహా శివరాత్రి ఫెస్టివల్ రోజునే వచ్చింది. అక్కడినుండి కం బ్యాక్ స్టార్ట్ అయ్యింది. సో పవన్ కళ్యాణ్ కే కాదు.. పవర్ స్టార్ ఫాన్స్ కి కూడా మహాశివరాత్రి పండగ ఓ సెంటిమెంట్ డేట్ అయిపోయింది.
ఈ సంవత్సరం మార్చ్ 11 మహాశివరాత్రి. ఆ రోజు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల జాతర జరగబోతుంది. అటు క్రిష్ సినిమా నుండి అయితే టైటిల్ ఎనౌన్సమెంట్, లేదు గ్లిమ్బ్స్ అంటూ వదలబోతున్నారు. అలాగే తమకు బాగా అచ్చొచ్చిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ రోజు ఏదో ఒక పోస్టర్ తోనో, లేదంటే మోషన్ పోస్టర్ తో అయినా ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చి లాంఛనంగా రంగంలోకి దిగాలని తాపత్రయపడుతున్నాడు. ఇక ఏప్రిల్ 9 న విడుదలకు రెడీ గా వున్న వకీల్ సాబ్ కోసం కూడా అదే మార్చి 11 న ఒక అప్ డేట్ రాబోతుంది. మరి తనకి అచ్చొచ్చిన మహాశివరాత్రికి మూడు సినిమాల అప్ డేట్స్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చి మరీ రెచ్చిపోనున్నాడు పవన్ కళ్యాణ్.
అన్నట్టు మహా శివ భక్తుడైన పరమేశ్వర ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ కూడా మహాశివరాత్రి రోజున తాను పవన్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ తాలూకు సర్ప్రైజ్ ఏమైనా పవన్ ఫాన్స్ కి ఇస్తాడేమో చూద్దాం.