దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా జనగణమన అనే స్క్రిప్ట్ ని, ఆ టైటిల్ ని తన దగ్గర పెట్టుకుని అటు మహేష్ బాబు చుట్టూ, ఇటు పవన్ కళ్యాణ్ చుట్టూ, కొన్నిసార్లు చిరంజీవితో కూడా సంప్రదింపులు జరిపిన పూరి జగన్నాధ్.. జనగణమన ని మాత్రం ఇప్పటివరకు తెరపైకి తీసుకురాలేకపోయారు. ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు. స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ ని మెటీరియలైజ్ చేయలేకపోయారు. అయితే జనగణమన టైటిల్ ని పూరి అన్ని భాషల్లో రిజిస్టర్ చేయించి ఉంటే బావుండేది. పూరి జనగణమన చెయ్యడం లేట్ చేసాడు కదా అని మిగతా వాళ్ళు కామ్ గా కూర్చుని ఊరుకోరు కదా. అందులోను సబ్జెక్టు బేసెడ్ మూవీస్ చేసే మలయాళం ఇండస్ట్రీ అస్సలూరుకోదు. జనగణమన టైటిల్ తో పృద్వి రాజ్ సుకుమారన్ ఆల్రెడీ సినిమా చేసేసాడు. టీజర్ కూడా రిలీజ్ చేసేసాడు.
పృద్వి రాజ్ అంటే మనవాళ్లకు పరిచయం ఉన్న పేరే. చిరంజీవి రీమేక్ చేస్తున్న లూసిఫర్ లో నటించడమే కాదు.. ఆ సినిమాని డైరెక్ట్ కూడా చేసారు. పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్న అయ్యప్పన్ కోషియమ్ లో వన్ అఫ్ ద హీరో పృద్వి రాజ్. మలయాళంలో వన్ అఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఆయన జనగణమన టైటిల్ తో ఓ అద్భుతమైన ఎక్సపెరిమెంటల్ ఫిలిం చేసాడు. దానికి అద్భుతమైన అప్రిసెషన్ వస్తుంది. ఖైదీగా పృద్వి రాజ్ లుక్స్ టీజర్ కి హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జనగణమన టీజర్ కి హైలెట్ అనేలా ఉంది. అదే టైటిల్ తో పాన్ ఇండియా ఫిలిం చేద్దామనుకున్న పూరి జగన్నాధ్ కి ఇది ఎదురు దెబ్బె అని చెప్పాలి.