కాజల్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా ఒకే అందాన్ని మెయింటింగ్ చేస్తుంది. గ్లామర్ లో కానీ, బోడి షేప్ లో కానీ ఎలాంటి మార్పులకు చోటివ్వని కాజల్ అగర్వాల్ ఇప్పటికీ సినిమాలతో ఫుల్ బిజినే. చిరు ఆచార్య షూటింగ్ తో పాటుగా కాజల్ నటించిన మోసగాళ్లు సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఎప్పుడూ గ్లామర్ తారగా మెరిసిపోయే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా గ్లామర్ పరంగా కొద్దిగా కూడా తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గ్లామర్ తో మెరిసిపోయే కాజల్ అందం వెనుకొని అనుకోని జబ్బు దాగుంది. ఆ విషయాన్ని స్వయానా కాజల్ అందిరికి షేర్ చేసింది.
తాను చిన్నప్పుడు అంటే ఐదేళ్ల నుండే బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నానని.. వింటర్ సీజన్ వచ్చింది అంటే ఆ వ్యాధి తీవ్రత మరింత ఎక్కువవుతుంది అని, బ్రాంకియల్ ఆస్తమా వలన తాను చాలా ఇబ్బందులు పడినట్లుగా చెబుతుంది కాజల్. ఆ బ్రాంకియల్ ఆస్తమా వలన ఆహారానియమాలు పాటించాల్సి వచ్చేదని, ఆ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చేదని.. బ్రాంకియల్ ఆస్తమా నుండి రిలీఫ్ పొందడానికి ఇన్ హేలర్ ని కూడా వాడుతుండేదాన్ని అని చెబుతుంది కాజల్. ఇన్ హేలర్ వాడడం వలన చాలామంది సిగ్గుపడుతుంటారని, కానీ ఇన్ హేలర్ అనేది ఆస్తమాకు ఉపశమనం ఇచ్చే పరికరం కాబట్టి ఎవరూ సిగ్గుపడొద్దు అంటూ చెబుతుంది. మరి అంత అందమైన కాజల్ కి అలాంటి వ్యాధా అంటూ తెగ ఫీలైపోతున్నారు ఆమె అభిమానులు.