పరశురామ్ అనగానే గీత గోవిందం లాంటి ప్రేమ కథ, శ్రీరస్తు శుభమస్తు లాంటి లవ్ స్టోరీనే గుర్తొస్తాయి. అంటే పరశురామ్ దర్శకత్వం అంటే లవ్ స్టోరీనే. అప్పుడెప్పుడో రవితేజతో ఆంజనేయులు అనే యాక్షన్ ఫిలిం చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక గీత గోవిందం తర్వాత పరశురామ్ మహేష్ కోసమే సర్కారు వారి పాట రాసుకుని ఎలాగో మహేష్ డేట్స్ సంపాదించాడు. అయితే మహేష్ సినిమా సాలిడ్ గా సున్నితంగా, ప్రేమ కథలా తీస్తే ఫాన్స్ ఒప్పుకోరు. కాబట్టే సర్కారు వారి పాటను యాక్షన్ ఎంటర్టైనర్ గా పరశురామ్ పట్టాలెక్కించాడు. దుబాయ్ లో సర్కారు వారి పాట భారీ యాక్షన్ సీక్వెన్స్ ని పరశురామ్ పూర్తి చేసాడట. ఇప్పటికే లీకైన సర్కారు వారి పాట పిక్స్ లో హాలీవుడ్ రేంజ్ హంగామా కనబడుతుంది.
అంటే సర్కారు వారి పాట భారీ యాక్షన్ అందులోని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ పార్ట్ తో తెరక్కిస్తున్నాడట. ఫైట్ సీక్వెన్స్ మీద పరశురామ్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడట. సర్కారు వారి పాటలో మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించాడట. మహేష్ ఫాన్స్ కి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఫుల్ మీల్స్ అందిస్తాయని అంటున్నారు. మహేష్ తో పరశురాం క్లాస్ మూవీ తీస్తాడనుకుంటే.. మాస్ మాసాలనే తెరకెక్కిస్తున్నట్టుగా టాక్ అయితే ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. సర్కారు వారి పాటలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే లా ప్లాన్ చేసిన పరశురామ్.. ఇంతవరకు ఎప్పుడూ మహేష్ ని ఆ రేంజ్ లో ఏ దర్శకుడు చూపించలేదని.. ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే కొత్త మహేష్ ని, కొత్త పరశురామ్ ని కూడా చూడబోతున్నారంటూ మీడియా టాక్.