Advertisementt

ఈ క్యూట్ కపుల్ కి హిట్ పక్కా

Tue 09th Feb 2021 02:25 PM
vaishnav tej,krithi shetty,uppena,buchhibabu,vijay sethupati  ఈ క్యూట్ కపుల్ కి హిట్ పక్కా
Hit this cute couple ఈ క్యూట్ కపుల్ కి హిట్ పక్కా
Advertisement
Ads by CJ

మెగా హీరోల్లో ఏ హీరో అయినా చాలా గ్రాండ్ గా వెండితెరకి పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ దగ్గరనుండి నిన్నమొన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు.. వెండితెరకు హీరోలుగా పరిచయమయ్యారు. తాజాగా మరో హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన తో మరో రెండు రోజుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రామ్ చరణ్ చిరుత తో ఎంట్రీ ఇస్తే.. అల్లు అర్జున్ గంగోత్రి తో పరిచయం అయ్యారు. ఇక వరుణ్ తేజ్ ముకుంద తో పరిచయమైతే.. సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక చిరు చిన్నలుడు కళ్యాణ్ దేవ్ సింపుల్ గానే ఎంట్రీ ఇచ్చిన వరస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. తాజాగా ఉప్పెన తో హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ ఉప్పెనపై గట్టి అంచనాలే ఉన్నాయి.

రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఉప్పెన సినిమాపై ప్రేక్షకుల్లోను అంచనాలు పెరిగిపోతున్నాయి. అందమైన కృతి శెట్టి హీరోయిన్ కావడం, లుక్స్ పరంగా ఆమెకి మంచి పేరు రావడం, వైష్ణవ తేజ్ ఫిగర్, ఎన్నో సినిమాలు చేసిన హీరో మాదిరి ఉన్న అతని నడవడిక, లుక్స్, ఇక మొదటి సినిమా అయినా బుచ్చిబాబు స్క్రీన్ ప్లే ట్రైలర్ తోనే హైలెట్ కావడం, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ రోల్ చెయ్యడం, ఉప్పెన ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్న మైత్రి వారి సాహసం అన్ని సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరోపక్క వైష్ణవ తేజ్ - కృతి శెట్టి ల ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. క్యూట్ కపుల్ గా వీరిద్దరూ ఉప్పెన సినిమాని ప్రమోట్ చేస్తుంటే.. ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. 

ఇక సంక్రాంతికి క్రాక్ తప్ప మరో సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత విడుదలైన 30 రోజుల ప్రేమకథ, జాంబిరెడ్డి సోసో గా ఆకట్టుకున్నాయి తప్ప హిట్ టాక్ రాలేదు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న  ప్రేక్షకులకి ఉప్పెన సరైన సినిమాలా కనిపిస్తుంది. మరి 100 పర్సెంట్ అక్యుపెన్సీతో వైష్ణవ తేజ్ అండ్ కృతి శెట్టి లు పక్కాగా హిట్ కొట్టడం ఖాయంగానే కనబడుతుంది.

Hit this cute couple:

Vaishnav Tej upcoming romantic ... movies Uppena is all set for its release on 12th February 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ