నేను రాజకీయాల్లోకి రావడం లేదు, కొత్త పార్టీ పెట్టడం లేదు .. అది కేవలం ఓ ఛానల్ అత్యుత్సాహం అంటూ కొట్టిపారేసిన వైఎస్ షర్మిలా నేడు తన ఇంట్లోనే కొంతమంది రాజకీయనేతలతో సమావేశం అవడం వైసిపి వర్గాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం అన్న జగన్ కోసం వైఎస్ షర్మిల పాద యాత్ర చేసి.. అన్నని సిఎం పీఠం ఎక్కించేవరకు నిద్రపోలేదు. మరి జగన్ సీఎం అయ్యాక వైఎస్ షర్మిల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారో.. అన్న జగన్ కావాలని పట్టించుకోలేదో కానీ.. వైఎస్ షర్మిల ఇప్పుడు కొత్త పార్టీ కోసం సన్నాహాలు మొదలు పెట్టింది. గత నెలరోజులుగా మీడియాలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ విషయాన్నీ ఓ ఛానల్ పదే పదే కథనాలు ప్రసారం చేస్తే.. అది కేవలం ఆ ఛానల్ అత్యుత్సాహం షర్మిల పార్టీ పెట్టడం లేదంటూ వైసిపి వర్గాలు ఇంతెత్తున లేచాయి. షర్మిల కూడా కొత్త పార్టీ వార్తలను ఖండించింది కూడా.
కానీ నేడు హైదరాబాద్ లో వైఎస్ షర్మిల తనతండ్రి రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజుని పురస్కరించుకుని తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి అభిమాన రాజకీయ నేతలతో ఆత్మీయ సమావేశం అంటూ కొత్తగా మొదలు పెట్టింది. అది జగన్ కి సుతరామూ నచ్చడం లేదు. కాబట్టే వైసీపీ నేతలు గమ్మున కూర్చున్నారు.లేదంటే వైఎస్ షర్మిలకు మద్దతునిస్తూ సాక్షి ఛానల్ లో హడవిడి చేసేవారు. మరి జగన్ సొంత ఛానల్ సాక్షి ఛానల్ అయితే వైఎస్ షర్మిల ఏం చేసుకుంటే మాకెందుకు అన్నట్టుగా కామ్ అయ్యింది. కానీ షర్మిల ఆత్మీయ సభ కాస్తా రాజకీయ పార్టీగా మారడం ఖాయమని మిగతా ఛానల్స్ ఆమె ఇంటి ముందు పడిగాపులు పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని కొంతమంది ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల సమావేశాలు ఏ రూపు దాలుస్తాయో అనే ఆసక్తితో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.
షర్మిల అన్న జగన్ కి వ్యతిరేఖంగా సైలెంట్ గా పావులు కదుపుతూ కొత్త పార్టీ మీద పట్టు సాధించే దిశగా అడుగులు వెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. జగన్ సీఎం అవకముందు చెల్లి షర్మిలతో అనుబంధాన్ని కొనసాగించినా సీఎం అయ్యాక షర్మిలని పూర్తిగా పక్కనబెట్టబట్టే ఇలాంటీ నిర్ణయం తీసుకుంది. అందుకే అన్నకి పోటీగా పార్టీ పెడుతుంది అని అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశాలు నేటితో ముగియవని.. తెలంగాణాలో జిల్లాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలతో కొత్త పార్టీ మొదలు పెట్టబోతోందిఅని అంటున్నారు. మరి నిజంగా రాను రాను అంటూనే షర్మిల జగన్ కి భలే ఝలక్ ఇచ్చిందిగా అంటున్నాయి ప్రతి పక్షాలు.