ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మొదలైన సలార్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అసలు ప్రభాస్ స్పీడు ని జోరుని ఎవరూ ఊహించలేకపోతున్నారు. రాధేశ్యాం షూటింగ్, సలార్ షూటింగ్, ఆదిపురుష్ షూటింగ్ అంటూ ప్రభాస్ మమములు స్పీడుగా లేడు. సలార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగానే ఆదిపురుష్ సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది ప్రభాస్ కి., మరోపక్క రాధేశ్యామ్ షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యాం షూటింగ్ చిత్రకరణ పూర్తి కావొస్తుంది. అయితే జస్ట్ ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట రాధేశ్యామ్ కి. ఆ సాంగ్ చిత్రకరణ పూర్తయితే రాధేశ్యామ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లే అంటున్నారు.
మరి ఆ సాంగ్ అవ్వగానే ప్రభాస్ సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్స్ తో బాగా బిజీ అవుతాడు. అటు రాధాకృష్ణ కూడా సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వస్తున్నా ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదు. సాహో టైం లో చిత్రీకరణ ముగించి విఎఫెక్స్ పూర్తయ్యాక.. లాస్ట్ మినిట్ లో ప్రమోషన్స్ కి వెళ్లారు. అదే సాహో ని బాగా దెబ్బకొట్టింది. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలోనూ అదే జరుగుతుంది అని ప్రభాస్ ఫాన్స్ భయపడుతున్నారు. వాలంటైన్స్ డే రోజున రాధేశ్యామ్ టీజర్ అన్నారు. ఆ టీజర్ తో అయినా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ఒప్పుకోవడం కాదు.. దానికి కావాల్సిన ప్రమోషన్స్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఆ విషయంలో ప్రభాస్ అయినా పర్ఫెక్ట్ గా ప్లానింగ్స్ పెట్టుకుంటేనే కానీ.. లేదంటే కష్టం. చూద్దాం రాధేశ్యామ్ డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో మొదలు పెడతారో అనేది.