Advertisementt

అభిజిత్ కి యాటిట్యూడ్ ఎక్కువైందిగా

Sat 20th Feb 2021 12:30 PM
netizens,bigg boss,winner,abhijith,bigg boss winner  అభిజిత్ కి యాటిట్యూడ్ ఎక్కువైందిగా
Abhijit's attitude is high అభిజిత్ కి యాటిట్యూడ్ ఎక్కువైందిగా
Advertisement
Ads by CJ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో మళ్ళీ కొన్నేళ్ళకి బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ప్రేక్షకులని పలకరించాడు. బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ అంతగా చేసింది ఏమి లేదు. అప్పుడప్పుడు యాటిట్యూడ్ చూపించడం తప్ప. గేమ్ పరంగా వీక్ అయినా..ఆభిజీత్ కున్న క్రేజ్ ఆయన్ని బిగ్ బాస్ విన్నర్ ని చేసింది అనేది వాస్తవం అంటుంటారు బిగ్ బాస్ లో అభిజిత్ అంటే పడని కంటెస్టెంట్స్. అభిజిత్ అసలేం చేసాడని అతడు విన్నర్ అయ్యాడు అనే వాళ్ళు లేకపోలేదు. కాకపోతే హీరోగా చేసిన అభిజిత్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉండబట్టే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కానీ.. లేకపోతె జస్ట్ రన్నర్ స్థానంలోనూ అభిజిత్ ఉండేవాడు కాదు అనేది కొంతమంది బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం. మరి బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చాక కొన్నాళ్ళు ఛానల్స్ చుట్టూ తిరిగిన అభిజిత్ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేకుండా ఫ్రీ గానే కనిపిస్తున్నాడు. సోహెల్ అయినా  అవకాశాల హడావుడితో అభినులకి దగ్గరగానే ఉంటున్నాడు కానీ.. అటు అఖిల్ కూడా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఇంకాస్త యాటిట్యూడ్ ఎక్కువైంది అంటున్నారు. ఎందుకంటే కాస్త అభిమానులతో దగ్గరగానే ఉంటున్నా.. ఆదివారం బిగ్ బాస్ లో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవం లో అభిజిత్ స్టార్టింగ్ లో కనిపించి మళ్ళి చివరిలో ఓ డాన్స్ పెరఫార్మెన్స్ కి కనిపించాడు తప్ప మళ్ళీ షోలో హడావిడే లేదు. అఖిల్, మోనాల్, సోహెల్, అవినాష్, అరియనా, హారిక, నోయెల్ లాంటి వాళ్ళు షో ఎండ్ అయ్యేవరకు ఉన్నారు కాని అభిజిత్ మాత్రం షో మొదటిలో అలాగే చివరిలో దర్శనమిచ్చాడు. పోనీ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడా అంటే అది లేదు. ఏదో మొక్కుబడిగా బిగ్ బాస్ ఉత్సవానికి రావాలని వచ్చినట్టుగా ఉంది అభిజిత్ వ్యవహారం. అంటే అభిజిత్ ఏమనుకుంటున్నాడు. అసలు ఇంకా హీరోలా ఫీలవుతున్నాడా? లేదంటే మరేదన్నా ఉందా? అంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? అంటూ కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు.

Abhijit's attitude is high:

Netizens says Abhijith's attitude has increased since he became the Bigg Boss winner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ