బుల్లితెర మీద అనసూయ గ్లామర్ రచ్చ ఎలా ఉంటుందో స్పెషల్ షోస్ లోను, జబర్దస్త్ స్టేజ్ మీద చూస్తూనే ఉన్నాం. అనసూయ గ్లామర్ కి పడిచచ్చిపోయే యూత్ ఉంది. జబర్దస్త్ బ్యూటీ అనసూయ అందాలను ఎంత వర్ణించినా తక్కువే అన్నట్టుగా ఉంటున్నాయి ఆమె చేయిస్తున్న గ్లామర్ ఫోటో షూట్స్. అయితే బుల్లితెర రాణి ఇప్పుడు వెండితెర మీద కూడా వెలిగిపోతుంది. వరస సినిమాలతో ఏ యాంకర్ కి లేని ఆఫర్స్ అనసూయ చేతిలో ఉన్నాయి. అనసూయ ఏకంగా ఐదారు తెలుగు సినిమాల్లో నటిస్తుంది అంటే నమ్మశక్యం కాదు. కృష్ణవంశీ రంగ మార్తాండలో కీలక పాత్రలో అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. చివరి షెడ్యూల్ లో షూటింగ్ ఉంది.
అనసూయ ప్రధాన పాత్రలో థాంక్యూ బ్రదర్ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యి రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోపక్క అనసూయ రవితేజ ఖిలాడీ సినిమాలో పవర్ ఫుల్ రోల్ పోషించబోతుంది. ఇప్పటికే అనసూయ ఖిలాడీ సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఖిలాడీ లో రవితేజ ని ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ పాత్ర చేస్తుంది అనే టాక్ ఉంది. ఇక కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. దాని కోసం 30 లక్షలు అందుకోబోతున్న అనసూయ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బన్నీ పుష్ప సినిమాలోనూ అనసూయ ఓ పాత్ర చేస్తుంది అని టాక్ ఉన్నా అది పూర్తి క్లారిటీ రాలేదు. మరోపక్క అనసూయ ఒక తమిళ సినిమా చేస్తుంది. మరి బుల్లితెర మీద ఖాళీ లేని డేట్స్ తో ఉన్నా.. అటు వెండితెర మీద అనసూయ మెరుపులు మాములుగా లేవుగా.