అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ రంపచోడవరం, మారేడుమిల్లు అడవుల్లో రెండు నెలల పాటు ఏకధాటి షూటింగ్ అనంతరం హైదరాబాద్ కి షిట్ అయ్యింది పుష్ప యూనిట్. రంపచోడవరం, మారేడుమిల్లు అడవుల్లో పుష్ప లోని కీలక యాక్షన్ సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించాడు. అయితే పుష్ప యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం మారేడుమిల్లు అడవులని వదిలి రీసెంట్ గా హైదరాబాద్ కి చేరుకోగానే చిరు ఆచార్య టీం మారేడుమిల్లు అడవులకి అందులోని పుష్ప షూట్ చేసిన లొకేషన్స్ కి వెళ్లబోతుంది.
పుష్ప షూటింగ్ జరిగిన లొకేషన్స్ లోనే ఆచార్య లో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కొరటాల శివ ఆచార్య టీం తో సహా మారేడుమిల్లు అడవులకి వెళ్ళబోతున్నాడట. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ జరిగిన సెట్ లోనే ఆచార్యలోని కీలక సన్నివేశాల చిత్రీకరణని కొరటాల ప్రారంభించబోతున్నాడట. పుష్ప షూటింగ్ కోసం అప్పట్లో మారేడుమిల్లు అడవుల్లో ప్రత్యేకంగా ఓ గెస్ట్ హౌస్ సెట్ నిర్మించారు. ఇప్పుడు ఆచార్య టీం ఆ గెస్ట్ హౌస్ లో స్టే చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లోనే రామ్ చరణ్ కి హీరోయిన్ గా ఫిక్స్ అయిన పూజ హెగ్డే కూడా ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.