Advertisementt

క్రిష్ ఎందుకలా ఆలోచిస్తున్నాడు

Mon 08th Feb 2021 12:19 PM
krish,pawan kalyan,kondapalem book,vaishnav tej,rakul  క్రిష్ ఎందుకలా ఆలోచిస్తున్నాడు
Why is Krish's still thinking? క్రిష్ ఎందుకలా ఆలోచిస్తున్నాడు
Advertisement
Ads by CJ

క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ కి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకుని పవన్ టైటిల్ పరిశీలనలో బిజీగా వున్నాడు. పవన్ - క్రిష్ ఫ్రెష్ షెడ్యూల్ ఈ నెల 19 నుండి మొదలు కాబోతుంది. పవన్ సినిమాకి హరిహర వీరమల్లు టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యణ్ ని ఒప్పించి ఆయన మేనల్లుడు వైష్ణవ తేజ్ తో కొండపాలెం నవల ఆధారంగా తెరకేకించిన లో బడ్జెట్ మూవీ విషయాలను క్రిష్ ఎక్కడా అప్ డేట్ ఇవ్వడం లేదు. పవర్ స్టార్ కాబట్టే నేను మరో సినిమా చేస్తా అంటే ఒప్పుకున్నారు. మరెవరన్నా హీరో అయితే కాదు కూడదు నా ప్రాజెక్ట్ మీదే ఉండాలనేవారు అంటూ చెప్పిన క్రిష్.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ - రకుల్ తో తెరకెక్కించిన సినిమా గురించి పట్టించుకోవడం లేదు.

కనీసం సినిమాకి టైటిల్ కానీ, రిలీజ్ డేట్ కానీ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టేసాడు. మరి పవన్ సినిమాతో బిజీగా ఉండడడం వలన క్రిష్ ఆలా చేస్తున్నాడా? లేదంటే వైష్ణవ తేజ్ ఉప్పెన విడుదల కాకుండా సెకండ్ మూవీ గురించి ఇప్పుడే పబ్లిసిటీ ఇవ్వడం దేనికి అని ఊరుకున్నాడా? లేదంటే మారేదన్నా క్రిష్ ఆలోచనో కానీ వైష్ణవ తేజ్ తో క్రిష్ తెరకెక్కించిన సినిమా అప్ డేట్ కోసం మెగా ఫాన్స్ కూడా వెయిటింగ్. రేపు 12 న ఉప్పెన థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన రెండో సినిమా జాడలేదంటూ గోల గోల చేస్తున్నారు. క్రిష్ మాత్రం రకుల్ - వైష్ణవ మూవీ అప్ డేట్ ఇచ్చేందుకు సిద్ధగా లేడనిపిస్తుంది. మరి ఉప్పెన రిలీజ్ అయ్యి హిట్ కొడితే ఎమన్నా డేట్, టైటిల్ ప్రకటిస్తాడేమో చూడాలి.

Why is Krish's still thinking?:

Krish not caring about the movie starring Vaishnav Tej and Rakul?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ