జయలలిత నెచ్చెలి శశికళ నాలుగేళ్లు జైలు జీవితం తర్వాత అనారోగ్య కారణాలతో హాస్పిటల్ పాలై కోలుకుని చివరికి చెన్నైకి చేరుకోబోతుంది. అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లక ముందు శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్లాన్ చేసుకుని సీఎం పీఠం పై కన్నేసింది. కానీ అక్రమాస్తుల కేసు శశికళ మీదకి చుట్టుకుని జైలు పాలయ్యింది. అప్పట్నుండి ఇప్పటివరకు చిన్న జిల్లానే ఉంది. ఇక వారం క్రితం జైలు నుండి విడుదులై ఇంకా చెన్నైకి రాని శశికళ నేడు ధూమ్ ధామ్ అంటూ భారీ కాన్వాయ్ తో చెన్నైలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే బెంగుళూరు నుండి బయలుదేరిన చిన్నమ్మ మరికాసేపట్లో తమిళనాడుకి చేరుకోబోతుంది. శశికళ వర్గీయులు ఆమెకి ఘనంగా భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తుంటే తమిళనాడు ప్రభుత్వం చిన్నక్కకి చుక్కలు చూపించాడనికి రెడీ అయ్యింది. దానితో శశికళను జయలలిత సమాధి దగ్గరకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఇక చిన్నమ్మకి బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే రహదారిపై 66 చోట్ల స్వాగత ద్వారాలను, వేదికలను ఏర్పాటు చేశారు ఆమె అభిమాన గణం. చెన్నై లో కాలు పెట్టి తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తా అంటూ శశికళ పావులు కదుపుతుంది. అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు శశికళ దగ్గరకు చేరినట్టుగా మీడియాలో కథనాలు ప్రచారంలోకొచ్చాయి. మరి శశికళ రాజకీయ వ్యూహం ఎలా ఉందొ కానీ.. ఆమెని కట్టడి చేసేందుకు అన్నాడీఎంకే పావులు కదుపుతుంది. మరి చిన్నమ్మ చెన్నైకి చేరుకునే ముందు తమిళనాడు బోర్డర్ అత్తిబెలె నుంచి చెన్నై వరకూ ఆమెపై పూలవర్షం కురిపించేందుకు శశికళ వర్గీయులు భారీ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నారు. మళ్ళీ తమిళనాట చిన్నమ్మ శకం మొదలు కాబోతుందేమో చూడాలి.