గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కారణం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ని సీఎం చెయ్యబోతున్నారు అంటూ ప్రచారం జరగడం, దానికి ఊతం ఇస్తూ టీఆరెస్ మంత్రులు మాట్లాడడంతో కేటీఆర్ కి ముఖ్యమంత్రి పీఠం ఖాయమనే అనుకున్నారు. అందుకే మంత్రి పదవి కూడా కట్టబెట్టలేదు అంటూ ఏవేవో కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఈ ఫిబ్రవరిలో కేటీఆర్ పట్టాభిషేకం అంటూ ప్రచారం చేసారు. ఇక ఆల్మోస్ట్ కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నాడు అనుకున్న సమయంలో కేసీఆర్ బాంబు పేల్చారు.
కేటీఆర్ కాబోయే సీఎం అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర దించినట్లే మాట్లాడారు. అంటే వచ్చే పదేళ్ల వరకు తెలంగాణ సీఎం గా తనే ఉంటా అంటూ.. ఇంకా తాను చాలా ఆరోగ్యం ఉన్నానని.. తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పడమే కాదు.. సీఎం పీఠం విషయంలో టీఆరెస్ ఎమ్యెల్యేలు, మంత్రలు సంయమనం పాటిస్తే బావుంటుంది అంటూ చెప్పడమే కాదు.. ఏది అవసరమో.. అదే మాట్లాడాలని, అనవసర విషయాల జోలికి విషయాల జోలికి వెళ్లొద్దంటూ కేసీఆర్ సున్నితంగానే తన మంత్రులకి వార్నింగ్ లాంటిది పడేసారు. దానితో కేటీఆర్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కేసీఆర్ సారూ అంతమాటనేసారేమిటి అంటూ తెగ బాధపడిపోతున్నారు.