Advertisementt

బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. స్టేజ్ ల మీద కూడా

Fri 19th Feb 2021 07:25 PM
bigg boss,telugu 4,contestants,super hungama,bigg boss  బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. స్టేజ్ ల మీద కూడా
Not only in Bigg Boss House .. but also on stage బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. స్టేజ్ ల మీద కూడా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో కామెడీ, కోపం, ఎమోషన్ అన్ని కలగలిపిన కంటెస్టెంట్స్ ఉంటారనేది తెలుగులో ప్రసారమయిన నాలుగు సీజన్స్ లోను చూసాం. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ అయిన వారు ఉన్నారు, శత్రువులుగా మారిన వారు ఉన్నారు. సీజన్ వన్ లో అర్చన ఎమోషనల్ గా కనబడితే , నవదీప్ కామెడీ చేసాడు. సీజన్ టు లో చాలామంది ఎమోషనల్ గా కనిపించారు. ఇక సీజన్ 3 లో కుళాయి తిప్పిన మాదిరి బాగా ఏడ్చేసిన శివ జ్యోతి ఉంది. శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇక గత ఏడాది సీజన్ లో మోనాల్ గజ్జర్ చీటికీ మాటికీ ఏడుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అవినాష్ కామెడీ పండించగా హౌస్ లో లాస్య లాంటి వాళ్ళు ఎమోషనల్ గానే గడిపేవారు. 

మరి బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవం అంటూ ఈ ఆదివారం,ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఉత్సవం షో లోను అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. నోయెల్ తన పాత బిగ్ బాస్ మిత్రులను తలచుకుంటూ పాట పాడగా అమ్మా రాజశేఖర్, లాస్య, అవినాష్ లు వచ్చేసి నోయెల్ ని హగ్ చేసుకుని ఎమోషనల్ గా మారిపోయారు. ఇక సోహెల్ నాకు ముగ్గురు ఫ్రెండ్స్ అఖిల్, మెహబూబ్, మోనాల్ అనగానే మోనాల్ కళ్ళ నీళ్లు పెట్టేసుకుంది. అవినాష్ - అరియనా ఎప్పటిలాగే కామెడీ చేస్తూ బిగ్ బాస్ ఉత్సవం స్టేజ్ మీద నవ్వులు పూయించారు. మరి బిగ్ బాస్ హౌస్ లోనే కాదు ఈ కామెడీ, ఫైటింగ్, ఎమోషన్ అన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఉత్సవమ్ స్టేజ్ మీదకి షిఫ్ట్ అయ్యాయన్నమాట.

Not only in Bigg Boss House .. but also on stage:

Bigg Boss Telugu 4 contestants super hungama in Bigg Boss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ