Advertisementt

అనుకోకుండా మరో చిరు ప్రకటన!

Sun 07th Feb 2021 11:33 AM
chiranjeevi,uppena event,vaishnav tej,director bobby,mythri movies  అనుకోకుండా మరో చిరు ప్రకటన!
Megastar Chiru Speech at Uppena Event అనుకోకుండా మరో చిరు ప్రకటన!
Advertisement
Ads by CJ

వేదిక ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు ఫ్లో లో తమ మెగా కాంపౌండ్ సినిమాల డిటైల్స్ అన్ని చెప్పేసే మెగాస్టార్ చిరు ఇప్పుడు ఉప్పెన ఈవెంట్ లోను అదే పని చేసారు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉప్పెన సినిమా చాలా బావుంటుంది అని, ఉప్పెన స్టోరీ సుకుమార్, బుచ్చి బాబు చెప్పినప్పుడే తనకి చాలా బాగా నచ్చింది అని, ఉప్పెన సినిమా చూసాక ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి చెప్పేద్దామనుకున్నా కానీ ఆపుకున్నాను.. సినిమా రంగస్థలం అంత హిట్ అవడం ఖాయమంటూ స్పీచ్ ఇచ్చారు చిరు. అంతేకాదు.. ఉప్పెన సినిమా స్క్రీన్ ప్లే గురించి చిరు చాలా వివరంగా స్టేజ్ మీద ఎక్స్ప్లైన్ చేసాడు. ఉప్పెన స్క్రీన్ ప్లే అద్భుతం అంటూ సినిమా మీద హైప్ పెంచేసాడు. 

అంతేకాకుండా అప్పుడెప్పుడో వేరే సినిమా ఈవెంట్ లో కొరటాల శివ తో తాను చెయ్యబోతున్న మూవీ టైటిల్ ఆచార్య అంటూ రివీల్ చేసిన చిరంజీవి.. బిగ్ బాస్ స్టేజ్ మీద మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ అంటూ రివీల్ చేసేసాడు. అధికారికంగా ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వకుండా చిరు ఇలా ప్రతిసారి ఎదో ఒక ఈవెంట్ లో తన సినిమాల ప్రకటనలు చేస్తున్నట్టుగా లూసిఫెర్ రీమేక్ ఓపెనింగ్ రోజున తన తదుపరి నాలుగు దర్శకులతో పిక్ దిగి దాన్ని నా నాలుగు కెప్టెన్స్ అంటూ ట్వీట్ చేసాడు. రీసెంట్ గా ఉప్పెన ఈవెంట్ లో చిరంజీవి తాను బాబీతో చెయ్యబోయే సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాడంటూ లీక్ చేసేసాడు. అంటే అధికారికంగా మైత్రి మూవీస్ - బాబీ దర్శకత్వంలో చిరు సినిమా  అలా కన్ఫర్మ్ అయ్యింది.

Megastar Chiru Speech at Uppena Event:

Chiranjeevi confirms film with Bobby, Mythri to producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ