ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్యన మంట పెట్టడం చాలా సహజం. కానీ ఏపీ లో మాత్రం ఎన్నికల కమిషన్ - వైసిపి ప్రభుత్వం మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడా తగ్గడం లేదు. వైసిపి బెదిరింపులకు భయపడకుండా కౌంటర్ ఎటాక్స్ ఇస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ మంత్రి పెద్దిరెడ్డి - నిమ్మగడ్డ వ్యవహారం ముదిరి పాకాన పడింది. నిమ్మగడ్డ కి పిచ్చెక్కింది అని, చంద్రబాబు లా నిమ్మగడ్డ కూడా పిచ్చి ముదిరికొట్టుకుంటున్నాడని నిమ్మగడ్డ పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.. అధికారులు కనక నిమ్మగడ్డ చెప్పినట్టు చేస్తే, నిమ్మగడ్డ పంపే నివేదికలకు అనుగుణంగా పని చేసే అధికారులను మార్చ్ 31 తర్వాత బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్ది రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతూ SEC నిమ్మగడ్డ మంత్రి పెద్ది రెడ్డి పై యాక్షన్ తీసుకోవాలంటూ గవర్నర్ కి లేఖ రాసారు.
అయితే ప్రభుత్వ అధికారులని బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి బెదిరించడంపై నిమ్మగడ్డ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకూ మంత్రి పెద్ది రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దని, ఒకవేళ వచ్చినా మీడియాతో మట్లాడనివ్వవద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. అందులో భాగంగా నిమ్మగడ్డ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఉత్తర్వులు పంపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా SEC తెలిపింది.