సమంత అక్కినేని రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఉంది. సమంత గ్లామర్ గర్ల్ గా రోజు రోజుకి స్టయిల్ మార్చేస్తుంది. సాకి కోసం స్పెషల్ ఫోటో షూట్స్, అనుకున్న అద్భుతమైనపాత్ర దొరికితే సినిమాలు ఇలా ఉంది సమంత జోరు. టాప్ హీరోయిన్స్ కి అయినా కొద్దిగా విరామం దొరుకుతుందేమో కానీ.. అక్కినేని కోడలు ఎప్పుడూ ఫుల్ బిజీ. ప్రస్తుతం గుణశేఖర్ పాన్ ఇండియా ఫిలిం శాకుంతలం కోసం రెడీ అవుతున్న సమంత.. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సమంతకే కాదు.. ప్రేక్షకులకి, అభిమానులకి షాకిచ్చింది. తనకి ఎంతో నచ్చి చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ఫిబ్రవరి 12 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వలన ప్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా దర్శకద్వయం రాజ్- డీకే ప్రకటించారు. ఎప్పటినుండో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం సౌత్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ విషయంలో చేసిన తాత్సారమే.. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ విషయంలోనూ చేస్తున్నారు. అయితే సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశామని చెప్పిన వారు రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టేసారు. మరి సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం అక్కినేని అభిమానులు చాలా ఇంట్రెస్ట్ గా కాచుకుని ఉంటే.. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అనగానే వారు షాకవుతున్నారు.