రవితేజ క్రాక్ సినిమా జనవరి 9 న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. 18 కోట్లు థియేట్రికల్ రైట్స్ కి గాను.. బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలు కొల్లగొట్టింది. సంక్రాంతి పండగకి విడుదలైన మూడు సినిమాలకన్నా రవితేజ క్రాక్ సినిమాకే ప్రేక్షకులు జై కొట్టారు. ఈ సంక్రాంతి విన్నర్ క్రాక్ సినిమానే ఇది ఎవరూ కాదనలేని నిజం. లాక్ డౌన్ లో సినిమాకి ఎన్ని ఓటిటి ఆఫర్స్ వచ్చినా దర్శకుడు గోపీచంద్ పట్టుబట్టి థియేటర్స్ లోనే విడుదల చేయించిన క్రాక్ సినిమా వలన ఇప్పుడు ఆ దర్శకుడే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. కారణం క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు.
ఠాగూర్ మధు గతంలో ఠాగూర్ సినిమా సెంటిమెంట్ తో ఆయన తర్వాత నిర్మించిన సినిమాలు టైగెర్, విన్నర్, మిస్టర్, స్పైడర్ వరసగా నాలుగు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఆ నాలుగు సినిమాలు ఠాగూర్ మధుకి కరెక్ట్ ఝలక్కే ఇచ్చాయి. అయితే ఇప్పుడు క్రాక్ సినిమా కి లాక్ డౌన్ లో ఓటిటి ఆఫర్స్ కి నిర్మాత ఠాగూర్ మధు టెంప్ట్ అయినా.. దర్శకుడు గోపీచంద్ మలినేని గట్టిగా పట్టుబట్టి సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటాను అంటూ థియేట్రికల్ రిలీజ్ మీద చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. ఇక థియేటర్స్ లో క్రాక్ విడుదలయ్యే ముందు కూడా ఠాగుర్ మధు క్రాక్ ని టైం కి రిలీజ్ చెయ్యలేకపోయాడు.
జనవరి 9 న రిలీజ్ అంటే క్రాక్ మార్నింగ్ షోస్ పడలేదు. లేట్ గా క్రాక్ సినిమా రిలీజ్ అయినా కూడా సంక్రాంతి సినిమాల మీద పోటీ పడి తన దమ్ము చూపించుకుని కలెక్షన్స్ రాబట్టుకున్న సినిమా క్రాక్ అని తేలింది. సంక్రాంతి విన్నర్ క్రాక్ సినిమానే. అప్పుడు అంత నమ్మకంతో సినిమా మీద ఉన్న దర్శకుడు గోపీచంద్ తనకు రావాల్సిన బకాయిల కోసం కంప్లైంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడమనేది కరెక్టేనా? ఎందుకంటే లాభాలు జేబులో వేసుకున్న ఠాగూర్ మధు క్రాక్ డైరెక్టర్ కి ఇవ్వాల్సిన పారితోషకం ఇవ్వలేదట. అడిగితే పట్టించుకోవడం లేదట. అందుకే దర్శకుడు గోపీచంద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెట్లు ఎక్కితే.. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే అయ్యింది.. దానికి ఈ ఎగ్గొట్టిన దానికి లెక్క సరిపోయింది అంటూ అడ్డంగా వాదిస్తున్నాడట క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు. మరి హిట్ ఇచ్చిన దర్శకుడిని ఇలా పారితోషకం విషయంలో ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్.