రాజమౌళి దర్శకత్వంలో తారక్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ క్లయిమాక్స్ కి చేరింది. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ లో దసరా సందర్భంగా విడుదల డేట్ ప్రకటించగానే తారక్ - రామ్ చరణ్ అభిమానులు అలెర్ట్ అయ్యిపోయారు. ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ.. అందుకే ఆర్ ఆర్ ఆర్ పబ్లిసిటి ఓ రేంజ్ లో ఉండాలంటూ ట్వీట్స్, లైక్స్ తో సోషల్ మీడియాలో ఊపేసి నార్త్ లో సినిమాపై క్రేజ్ పెంచాలని ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఎలాగూ రాజమౌళి లుక్స్ మీద లుక్స్, అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ పాన్ ఇండియా అటెంక్షన్ మొత్తం ఆర్ ఆర్ ఆర్ మీదే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే క్లైమాక్స్ షూట్ మొదలు, క్లయిమాక్స్ యుద్దానికి రామరాజు - భీం రెడీ అంటూ పిక్స్ తో సహా అప్ డేట్స్ ఇచ్చేస్తున్నాడు.
తాజాగా రామరాజుగా రామ్ చరణ్, భీం గా తారక్ లు ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ షూట్ కోసం రిహార్సల్స్ చేస్తున్నారంటూ రాజమౌళి బిగ్ అప్ డేట్ ఇచ్చేసారు. ఇప్పటివరకు చాలామంది ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ షూట్ అయ్యిపోయింది.. అందుకే రామ్ చరణ్ ఆచార్య మూవీలోకి అడుగుపెట్టేసాడనే అనుకుంటున్నారు. కానీ నేడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ యుద్దానికి రామ్ - భీం లు రెడీ అవుతున్నారంటూ ఇచ్చిన అప్ డేట్ తో క్లయిమాక్స్ షూట్ అవ్వలేదని తెలిసింది. మరి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ పబ్లిసిటి కార్యక్రమాలు మార్చ్ నుండే మొదలు పెట్టబోతున్నారట ఆర్ ఆర్ ఆర్ టీం సభ్యులు.