బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోట్లో నోరు పెట్టాలంటే బాలీవుడ్ ప్రముఖులకు హడల్. కంగనా ని కెలక్కపోయినా బాలీవుడ్ టాప్ సెలెబ్రెటిస్ ని తన ట్వీట్స్ తో ఆడుకుంటుంది. కానీ తాప్సి మాత్రం కంగనాకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడంలో ఆరితేరిపోయింది. తాప్సిని ఎప్పటికప్పుడు కంగనా బి గ్రేడ్ హీరోయిన్ అంటూ సంబోధిస్తూ రెచ్చగొడుతుంది. తాప్సి - కంగనా మధ్యలో పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. తాజాగా మరోసారి కంగనా vs తాప్సి ట్వీట్స్ యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఢిల్లీ లో రైతు ఉద్యమం విషయం గురించి బాలీవుడ్ లో ట్వీట్స్ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ రైతు పోరాటానికి మద్దతుగా పాప్ సింగర్ రిహానా ట్వీట్ చేస్తూ రైతు పక్షాన ఎవరూ మాట్లాడారు.. ఎవరూ పోరాడారు ఏంటి అని చేసిన ట్వీట్ తో ఆమె పై బాలీవుడ్ సెలబ్రిటీస్ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.
రిహానా ట్వీట్ కి కౌంటర్ ఎటాక్ చేస్తూ అసలు వాళ్ళు రైతులైతే కదా..ఉగ్రవాదులు, ఈ విషయమై పూర్తి అవగానే లేకుండా మా దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ట్వీట్ చేసింది కంగనా. ఇంకొంతమంది సెలబ్రిటీస్ మా దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు తల దూర్చవద్దు అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్స్ తాప్సి మాత్రం ఒక్క ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక్క జోక్ మీ విశ్వాసాన్ని కదిలిస్తే అలాంటి సమయంలో ఐక్యతను బలోపేతం చేసే దిశగా మీ ట్వీట్స్ ఉండాలి కానీ.. ప్రచార కర్తల్లా ఉండకూడదు. అంటూ ట్వీట్ చేసింది.
దానితో మరోసారి తాప్సి పై కంగనా విరుచుకుపడింది. మళ్ళీ బి గ్రేడ్ హీరోయిన్ అంటూ తాప్సి ని ఉద్దేసిస్తూ ట్వీట్ చేసింది. బి గ్రేడ్ మనుషులకి బి గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. మాతృ భూమి కోసం ఓ వ్యక్తి ముందుండి పోరాడడమే అసలైన ధర్మం. ఇలాంటి విషయాలు తెలియకుండా కొంతమంది ఉచిత సలహాలు ఇస్తారు. అందుకే వాళ్ళని బి గ్రేడ్ అని పిలుస్తారు అంటూ కంగనా తాప్సి ని ఇండైరెక్ట్ గా ఆడుకుంది.