సినిమా అభిమానులు అతి అనగానే గుర్తొచ్చేది అరవ తంబీలు. అయితే ఇప్పుడు వారినే మించిపోయారు కన్నడ సోదరులు. బాహుబలి సినిమాతో ఎలాగైతే ఇండియా మొత్తం తెలుగు సినిమా వైపు చూసిందో.. కెజిఎఫ్ చాప్టర్ 1 తో కన్నడా ఇండస్ట్రీకి కూడా గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం.. ఎవరూ కాదనలేని నిజం. ఆలా అని వాళ్ళు చేస్తున్న అతి మాత్రం మాములుగా లేదు. కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ జులై 16 అని అనౌన్స్ చెయ్యగానే.. అది నేషనల్ హాలిడే గా ప్రకటించాలంటూ పీఎం మోడీకి యశ్ అభిమానులు లెటర్ రాయడం చాలా అతిగానే అనిపిస్తుంది. ఆల్రెడీ ప్రైడ్ అఫ్ ఇండియా అనుకునే బాహుబలి 2 సినిమాని చూసేసి ఉన్నారు ప్రేక్షకులు.
కెజిఎఫ్ 2 ని యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు. కానీ పీఎం మోడీకి యశ్ అభిమానులు లెటర్ పెట్టడం అనేది చాలా కామెడీగా ఉంది. నేషనల్ హాలిడే ని డిక్లెర్ చేయమనడం అనేది కామెడిగానే అనిపిస్తుంది. ఈ అతి ఇంతకు ముందు అరవ తంబీలు చేసేవాళ్ళు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీస్ థియేటర్స్ లో విడుదల తేదీ రాగానే తమిళ అభిమానులు, రజిని ఫాన్స్ రచ్చ తో కార్పొరేట్ కంపెనీస్ తమ ఎంప్లొయీస్ కోసం సెలవలు ప్రకటించేసేవి. లేదంటే స్వచ్ఛందంగా ఫాన్స్ సెలవలు పెట్టేస్తూ అతి చేసేవారు. ఇప్పుడు అరవ తంబిల దారిలో కన్నడ సోదరులు చేరారు. రాక రాక ఒక సరైన సాలిడ్ సినిమా పడితే ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలియక.. అతిగా ఆవేశ పడుతున్న కన్నడిగులు.. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టుగా అతి చేస్తున్నారు.