జనవరి 9 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైనా.. ఫైన్షియల్ ప్రోబ్లెంస్ వలన షోస్ లేట్ గా పడినా రవితేజ క్రాక్ థియేటర్స్ కి పట్టిన దుమ్ము దులిపి ఆరేసింది. కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ నిద్ర లేపింది. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల హడావుడితో క్రాక్ కి టికెట్స్ బాగా తెగాయి. అందులోను సంక్రాంతి సినిమాలు కాస్త అటు ఇటుగా అవడంతో క్రాక్ దూసుకుపోయింది. దానితో రవితేజ కి సూపర్ హిట్ పడింది. మాస్ మహారాజ్ రవితేజ - శృతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ థియేటర్స్ హడావిడి ముగిసి ఆహా లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. దానితో క్రాక్ క్లోజింగ్ కలెక్షన్స్ ఫిగర్ బాయటికి వచ్చింది. క్రాక్ క్లోసింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కోట్లలో
నైజాం 11.69 కోట్లు
సీడెడ్ 05.99
ఉత్తరాంధ్ర 04.12
ఈస్ట్ 03.19
వెస్ట్ 02.38
కృష్ణా 02.31
గుంటూరు 02.70
నెల్లూరు 01.75
ఏపీ అండ్ టీఎస్ 34.13 కోట్లు
ఇతర ప్రాంతాలు 01.65
ఓవర్సీస్ 00.85
టోటల్ వరల్డ్ వైడ్ 36.63 కోట్లు