జయలలిత నెచ్చలి శశికళ అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవించి.. జైలు నుండి విడుదలయ్యే సమయానికి అనారోగ్యంతో హాస్పిటల్ పాలై.. చివరికి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం బెంగుళూరులోనే ఉన్న శశికళ జైలు నుండి బయటికి రావడం ఆమె అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చినా.. ఏఐడీఎంకే కి మాత్రం నచ్చడం లేదు. అందుకే శశికళ రాజకీయాలకు ఏఐడీఎంకే చెక్ పెట్టేందుకు సిద్దమైంది. జయలలిత సమాధి దగ్గర శపధం చేసి.. తమినాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామనుకుని కలలు కన్న శశికళ కు ఈడీ షాకిచ్చి జైల్లో పెట్టింది. ఇక జయలలిత సమాధి దగ్గనుండే జైలు కి వెళ్లిన శశికళ మళ్ళీ చెన్నై లో అడుగుపెట్టే ముందు జయలలిత సమాధి ని సందర్శించడానికి రేడి అవుతుంది
ఈ నెల 7 వ తేదీన బెంగుళూరు నుండి చెన్నై కి బయలుదేరి ముందుగా జయలలిత సమాధిని సందర్శించాలని శశికళ అనుకుంటుంది. శశికళను ఏ విధంగానూ జయలలిత సమాధి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏఐడీఎంకే ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగానే జయలలిత సమాధి సందర్శనార్థం వచ్చే ప్రజలను ఆపివేసింది. ప్రస్తుతం జయలలిత సమాధి దగ్గరకు 15 రోజుల పాటు సందర్శని నిలిపివేసింది. సమాధి తుది మెరుగులు కోసం సందర్శన నిలిపివేసింది అని చెబుతుంది ఏఐడీఎంకే. అయితే శశికళను జయలలిత సమాధి దగ్గరకి రానివ్వకుండా చెయ్యడానికే ఏఐడీఎంకే ఇలాంటి ప్లాన్ వేసింది అంటూ శశికళ వర్గీయలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమిళనాట ఏఐడీఎంకే vs శశికళ అన్నట్టుగా ఉంది వ్యవహారం. శశికళకు ఎలాగైనా చెక్ పెట్టాలనే కసితో ఏఐడీఎంకే ఉంది.