మంచు వారబ్బాయి మంచు మనోజ్ గత కొంతకాలంగా కెరీర్ లోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఒడి దుడుకులు ఎదుర్కున్నాడు. సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చిన మనోజ్ ఈ మధ్యన బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో షాకివ్వడమే కాదు.. త్వరలోనే కొత్త విషయం చెబుతా అంటూ ఊరించాడు. అలాగే సినిమాల్లోకి రాబోతున్నా అంటూ హింట్స్ ఇచ్చాడు. ఇక పర్సనల్ లైఫ్ లో భార్య ప్రణతితో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మనోజ్ రెండోవ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రణతిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లాడిన మనోజ్ కి ప్రణతికి పొసగక విడాకులు తీసుకుంది ఈ జంట.
అప్పటినుండి ఒంటరిగా ఉంటున్న మనోజ్ మళ్ళీ రీసెంట్ గా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పుడు మోహన్ బాబు మనోజ్ కోసం పిల్లని వెతికి పెట్టాడని.. మోహన్ బాబు దగ్గర బంధువుల అమ్మాయితో మనోజ్ సెకండ్ మ్యారేజ్ జరగబోతున్నట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మనోజ్ అంగీకారం కోసం మోహన్ బాబు ఫ్యామిలీ వెయిటింగ్ అంట. మనోజ్ ఓకె చెప్పగానే మంచు ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగడం ఖాయమంటున్నారు. మరి ఈ మధ్యన మనోజ్ కూడా సామాజిక అంశాలు, పోలిటికల్ ఇష్యూస్‌పై సోషల్ మీడియాలో స్పందిస్తూ ట్రేడింగ్‌లో నిలుస్తున్నాడు.