Advertisementt

తేజకి 'నో' చెప్పి పవన్ కి 'ఓకె' చెప్పింది

Wed 03rd Feb 2021 02:03 PM
sai pallavi,director teja,pawan kalyan,ak remake,alivelu vebkataramana  తేజకి 'నో' చెప్పి పవన్ కి 'ఓకె' చెప్పింది
Teja said 'no' and Pawan said 'Ok' తేజకి 'నో' చెప్పి పవన్ కి 'ఓకె' చెప్పింది
Advertisement
Ads by CJ

దర్శకుడు తేజ అలివేలు మంగతాయారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారైంది. ఇంతకుముందు హీరోగా అనుకున్న గోపీచంద్ తేజ వెంకటరమణ పాత్ర నుండి తప్పుకున్నాడు. మళ్ళీ ఆ కేరెక్టర్ కోసం మరొకరిని వెతకాలి. ఇక రీసెంట్ గా అలివేలుగా సాయి పల్లవిని ఫిక్స్ అయ్యి ఆమెని సంప్రదించగా సాయి పల్లవి పారితోషకం బాగా డిమాండ్ చేసిందట. అయినా నిర్మతలు సాయిపల్లవినే అలివేలుగా ఫిక్స్ అయ్యి ఆమె అడిగింది ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారట. ఇక సాయి పల్లవి అడిగింది ఇవ్వడానికి రెడీ అయ్యి.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనుకునేలోపల సాయి పల్లవి తేజ కి నో చెప్పేసిందట. పారితోషకం ఎంతిచ్చినా ప్రస్తుతం నేను మీ సినిమా చెయ్యలేను అని సున్నితంగా చెప్పేసిందట.

కారణం పవన్ కళ్యాణ్ అయ్యప్పమ్ కోషియమ్ లో సాయి పల్లవికి పవన్ వైఫ్ కేరెక్టర్ రావడమేనట. ఏకే రీమేక్ లో సాయి పల్లవి ఫిక్స్ అని అందరికి తెలిసిన న్యూసే. అయినా సాయి పల్లవి పవన్ సినిమా కోసం తేజ సినిమా ఒదులుకోవడం అనేది ఎవరికీ తెలియని న్యూస్. కాకపోతే పవన్ కళ్యాణ్ తో ఎప్పటినుండో నటించాలనే కోరిక, అలాగే ఏకే రీమేక్ కి తక్కువ డేట్స్ సరిపోవడం, ఎక్కువ పారితోషకం ఉంటుంది కాబట్టి సాయి పల్లవి పాత్ర నిడివి తక్కువ అయినా పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ కి ఓకె చెప్పేసిందట. త్వరలోనే పవన్ కళ్యాణ్ - సాయి పల్లవి కాంబో సీన్స్ ని శేఖర్ కే చంద్ర మొదలు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం ఏకే రీమేక్ చిత్రీకరణలో రానా - పవన్ కళ్యాణ్ కాంబో సీన్స్, ఓ భారీ సీక్వెన్స్ నడుస్తుంది అని సమాచారం

Teja said 'no' and Pawan said 'Ok':

Sai Pallavi as Pawan kalyan's wife

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ